Thursday, 12 December 2013

"బాధ్యత"

అగ్ని కణికల నయనాల
ఆకలి జ్వాలలు . . .
అవి ... కన్నీళ్ళతో
ఆరిపోవు !

కారిన కన్నీళ్ళతో
దాహం తీరదు !
నిండుగ కనిపించే
నీతీ నిజాయితీ
అద్దం పగిలి ముక్కలైంది!

అవినీతి మొక్క పెరిగి
మహా   వృక్ష మైంది
లక్షలాది మందికి
ఆశ్రయ మిస్తోంది !
                                           
అవినీతిని వృక్షాన్ని
పెకలించాల్సిన వాళ్ళు
కొమ్మలు నరికి
విశ్రమిస్తున్నారు!

అవినీతి వృక్షాలముందు
కలుపు మొక్కల్లా
నీతీ నిజాయితీలు
మొకరిల్లుతున్నట్లుంది!

అవినీతిని అంతం...  చే...సి
నీతీ నిజాయితీలను
నిలబెట్టాల్సిన బాధ్యత
భావి భారత పౌరులదే ... సుమా!

No comments:

Post a Comment