చిత్రకారుడు
చెక్కు చెదరని ఏకాగ్రత ఉన్న
చిత్రకారుడు మనసు పెట్టి
కాన్వాసు మీద ఓ....
చిత్రానికి జీవం పొయ్యాలి .
గీసిన ఆ చిత్రం కళాత్మకం కావచ్చు
అందరి ప్రశంసలు కురియ వచ్చు
అధ్భుతంగా ఉందని దానికే ...
ఎన్నో అవార్డులు రావచ్చు .
కలగాపులగం లా కొన్ని గీతలు గీసి
దాన్నే మోడరన్ ఆర్ట్ అని అనచ్చు
ఆధునిక చిత్రకళ కదాని మెచ్చుకుని
మరెంతో... ప్రోత్సహించ వచ్చు .
ఓ .. ప్రముఖ రచయిత్రి నవలకు
నీ... చిత్రం 'ముఖచిత్రం 'కావచ్చు
లేక ఏ ధనవంతుని ఇంటికో...
అది 'గోడ చిత్రం' కావచ్చు .
ఏ నాటికైనా కళాకారుని 'దీక్ష' వృధా కాదు
'ఉత్సాహాన్ని' నీవు ఇసుమంతైనా కోల్పోకు
చెక్కు చెదరని 'ఏకాగ్రతను' చెదరనీకు
చెక్కులపై చెక్కుల 'ధనం' వచ్చి చేరు నీకు.
చెక్కు చెదరని ఏకాగ్రత ఉన్న
చిత్రకారుడు మనసు పెట్టి
కాన్వాసు మీద ఓ....
చిత్రానికి జీవం పొయ్యాలి .
గీసిన ఆ చిత్రం కళాత్మకం కావచ్చు
అందరి ప్రశంసలు కురియ వచ్చు
అధ్భుతంగా ఉందని దానికే ...
ఎన్నో అవార్డులు రావచ్చు .
కలగాపులగం లా కొన్ని గీతలు గీసి
దాన్నే మోడరన్ ఆర్ట్ అని అనచ్చు
ఆధునిక చిత్రకళ కదాని మెచ్చుకుని
మరెంతో... ప్రోత్సహించ వచ్చు .
ఓ .. ప్రముఖ రచయిత్రి నవలకు
నీ... చిత్రం 'ముఖచిత్రం 'కావచ్చు
లేక ఏ ధనవంతుని ఇంటికో...
అది 'గోడ చిత్రం' కావచ్చు .
ఏ నాటికైనా కళాకారుని 'దీక్ష' వృధా కాదు
'ఉత్సాహాన్ని' నీవు ఇసుమంతైనా కోల్పోకు
చెక్కు చెదరని 'ఏకాగ్రతను' చెదరనీకు
చెక్కులపై చెక్కుల 'ధనం' వచ్చి చేరు నీకు.
No comments:
Post a Comment