పచ్చని ప్రకృతే.. మా ప్రపంచం
స్మగ్లింగ్ దొంగలకది చీకటి సామ్రాజ్యం
మా ఆది వాసీల కాడి కొట్టిన పిండి
మాగురించి ఎంతోకొంత తెల్సు కోండి .
తేనే పట్టుని వెతికి పట్టి
పట్టు తేనె తుట్టెను కొట్టి
పట్టణాలలో అమ్మి బ్రతుకుతాం
పట్టుదలతో శ్రమించి పనిచేస్తాం.
తుమ్మచెట్ల జిగురు మా జీవనాధారం
చెట్టుకు చిన్న గాటు పెడితే లప్పెడు జిగురు
అది మాజాతివారిని కలిపి ఉంచినా...
మిగిలిన వారితో మమ్ములను కలపలేక పోయింది.
ఔషధ మొక్కలతో మాది
అక్కాచెల్లెళ్ళ అనుబంధం
ఏ మొక్క ఏంటో మొగదల మాకే తెలుసు
మరెందుకో..ంఏమంటే మీకు అలుసు.
వెదురు కర్ర గుడిసెలే మా భవంతులు
మా అజ్ఞానం , అమాయకత్వమే....
మోసపూరిత దళారులకు పెట్టుబడులు
మాపిల్లల చదువులకు కావాలెన్నో బడులు
పాము కాటేస్తే ఎవరినైనా....
ఆ విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేస్తాం!
మా గూడెం లోఎవరికైనా బాధ వొస్తే ..
మా గుండె లో పెట్టి కాచుకుంటాం!
ఆదాయం లేక ఆకలి బాధలు
మలేరియా తో జ్వరాల బాధలు
ఈ సమాజంలో మము చిన్న చూపు చూడొద్దు
సమ సమాజ శ్రేయస్సే అందరికీ ముద్దు
స్మగ్లింగ్ దొంగలకది చీకటి సామ్రాజ్యం
మా ఆది వాసీల కాడి కొట్టిన పిండి
మాగురించి ఎంతోకొంత తెల్సు కోండి .
తేనే పట్టుని వెతికి పట్టి
పట్టు తేనె తుట్టెను కొట్టి
పట్టణాలలో అమ్మి బ్రతుకుతాం
పట్టుదలతో శ్రమించి పనిచేస్తాం.
తుమ్మచెట్ల జిగురు మా జీవనాధారం
చెట్టుకు చిన్న గాటు పెడితే లప్పెడు జిగురు
అది మాజాతివారిని కలిపి ఉంచినా...
మిగిలిన వారితో మమ్ములను కలపలేక పోయింది.
ఔషధ మొక్కలతో మాది
అక్కాచెల్లెళ్ళ అనుబంధం
ఏ మొక్క ఏంటో మొగదల మాకే తెలుసు
మరెందుకో..ంఏమంటే మీకు అలుసు.
వెదురు కర్ర గుడిసెలే మా భవంతులు
మా అజ్ఞానం , అమాయకత్వమే....
మోసపూరిత దళారులకు పెట్టుబడులు
మాపిల్లల చదువులకు కావాలెన్నో బడులు
పాము కాటేస్తే ఎవరినైనా....
ఆ విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేస్తాం!
మా గూడెం లోఎవరికైనా బాధ వొస్తే ..
మా గుండె లో పెట్టి కాచుకుంటాం!
ఆదాయం లేక ఆకలి బాధలు
మలేరియా తో జ్వరాల బాధలు
ఈ సమాజంలో మము చిన్న చూపు చూడొద్దు
సమ సమాజ శ్రేయస్సే అందరికీ ముద్దు
No comments:
Post a Comment