Monday, 23 December 2013
Thursday, 19 December 2013
Thursday, 12 December 2013
"బాధ్యత"
అగ్ని కణికల నయనాల
ఆకలి జ్వాలలు . . .
అవి ... కన్నీళ్ళతో
ఆరిపోవు !
కారిన కన్నీళ్ళతో
దాహం తీరదు !
నిండుగ కనిపించే
నీతీ నిజాయితీ
అద్దం పగిలి ముక్కలైంది!
అవినీతి మొక్క పెరిగి
మహా వృక్ష మైంది
లక్షలాది మందికి
ఆశ్రయ మిస్తోంది !
అవినీతిని వృక్షాన్ని
పెకలించాల్సిన వాళ్ళు
కొమ్మలు నరికి
విశ్రమిస్తున్నారు!
అవినీతి వృక్షాలముందు
కలుపు మొక్కల్లా
నీతీ నిజాయితీలు
మొకరిల్లుతున్నట్లుంది!
అవినీతిని అంతం... చే...సి
నీతీ నిజాయితీలను
నిలబెట్టాల్సిన బాధ్యత
భావి భారత పౌరులదే ... సుమా!
ఆకలి జ్వాలలు . . .
అవి ... కన్నీళ్ళతో
ఆరిపోవు !
కారిన కన్నీళ్ళతో
దాహం తీరదు !
నిండుగ కనిపించే
నీతీ నిజాయితీ
అద్దం పగిలి ముక్కలైంది!
అవినీతి మొక్క పెరిగి
మహా వృక్ష మైంది
లక్షలాది మందికి
ఆశ్రయ మిస్తోంది !
అవినీతిని వృక్షాన్ని
పెకలించాల్సిన వాళ్ళు
కొమ్మలు నరికి
విశ్రమిస్తున్నారు!
అవినీతి వృక్షాలముందు
కలుపు మొక్కల్లా
నీతీ నిజాయితీలు
మొకరిల్లుతున్నట్లుంది!
అవినీతిని అంతం... చే...సి
నీతీ నిజాయితీలను
నిలబెట్టాల్సిన బాధ్యత
భావి భారత పౌరులదే ... సుమా!
"ఉన్నత శిఖరాలు" kavitha
"ఉన్నత శిఖరాలు"
ఎక్కువ జీతం వచ్చిన నాడు
విచ్చలవిడిగా ఖర్చు చేయకు
ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాటంటావు
ఎంట్రెన్సు లో లగ్జరీ కారంటావు
వీకెండ్సు లో విహార యాత్రంటావు
మంతెండ్సు లో ఎంప్టీ పాకెటంటావు
అమ్మానాన్నల పొదుపు పద్దతులు
దాచిన సొమ్మును వాడిన పద్దతులు
మరచి పోకుమా... జీవితమంతా!
మరచి పోకుమా... జీవితమంతా!!
అవసరమైనవాటిని
వందెక్కువైన కొనాలి
ఒకటి కొంటే మూడు ఉచితమన్నా...
అనవసరమైన వాటిని కొనకు మన్నా!
అమ్మ పొదుపు మాటెత్తితే ...
అమె పై అరుస్తావ్!
నాన్న పొదుపు మాటంటే....
నాన్న మీద నసుకుతావ్!
అర్ధాంగి పొదుపు మాటెత్తితే .
నీకర్ధం కాదు పొమ్మంటావ్!
ఏదో సంపాదిస్తున్నా..కదాని
పిచ్చిపిచ్చిగా... ఖర్చు చేయకు ..చిన్నా!
నీవు పొదుపు బాట నడవాలని..
మంచి మదుపరిగా ఎదగాలని నే కోరుతున్నా!!
అవసరమైన ఖర్చును ఆపకు
అనవసరమైన ఖర్చు చేయకు
నిర్మాణాత్మక పనులకు
నీ సొమ్మును వినియోగించు .
ఎన్నెన్నో 'ఉన్నత శిఖరాల ' నధిరోహించు
ఎక్కువ జీతం వచ్చిన నాడు
విచ్చలవిడిగా ఖర్చు చేయకు
ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాటంటావు
ఎంట్రెన్సు లో లగ్జరీ కారంటావు
వీకెండ్సు లో విహార యాత్రంటావు
మంతెండ్సు లో ఎంప్టీ పాకెటంటావు
అమ్మానాన్నల పొదుపు పద్దతులు
దాచిన సొమ్మును వాడిన పద్దతులు
మరచి పోకుమా... జీవితమంతా!
మరచి పోకుమా... జీవితమంతా!!
అవసరమైనవాటిని
వందెక్కువైన కొనాలి
ఒకటి కొంటే మూడు ఉచితమన్నా...
అనవసరమైన వాటిని కొనకు మన్నా!
అమ్మ పొదుపు మాటెత్తితే ...
అమె పై అరుస్తావ్!
నాన్న పొదుపు మాటంటే....
నాన్న మీద నసుకుతావ్!
అర్ధాంగి పొదుపు మాటెత్తితే .
నీకర్ధం కాదు పొమ్మంటావ్!
ఏదో సంపాదిస్తున్నా..కదాని
పిచ్చిపిచ్చిగా... ఖర్చు చేయకు ..చిన్నా!
నీవు పొదుపు బాట నడవాలని..
మంచి మదుపరిగా ఎదగాలని నే కోరుతున్నా!!
అవసరమైన ఖర్చును ఆపకు
అనవసరమైన ఖర్చు చేయకు
నిర్మాణాత్మక పనులకు
నీ సొమ్మును వినియోగించు .
ఎన్నెన్నో 'ఉన్నత శిఖరాల ' నధిరోహించు
సమ సమాజ శ్రేయస్సే... అందరికీ ముద్దు
పచ్చని ప్రకృతే.. మా ప్రపంచం
స్మగ్లింగ్ దొంగలకది చీకటి సామ్రాజ్యం
మా ఆది వాసీల కాడి కొట్టిన పిండి
మాగురించి ఎంతోకొంత తెల్సు కోండి .
తేనే పట్టుని వెతికి పట్టి
పట్టు తేనె తుట్టెను కొట్టి
పట్టణాలలో అమ్మి బ్రతుకుతాం
పట్టుదలతో శ్రమించి పనిచేస్తాం.
తుమ్మచెట్ల జిగురు మా జీవనాధారం
చెట్టుకు చిన్న గాటు పెడితే లప్పెడు జిగురు
అది మాజాతివారిని కలిపి ఉంచినా...
మిగిలిన వారితో మమ్ములను కలపలేక పోయింది.
ఔషధ మొక్కలతో మాది
అక్కాచెల్లెళ్ళ అనుబంధం
ఏ మొక్క ఏంటో మొగదల మాకే తెలుసు
మరెందుకో..ంఏమంటే మీకు అలుసు.
వెదురు కర్ర గుడిసెలే మా భవంతులు
మా అజ్ఞానం , అమాయకత్వమే....
మోసపూరిత దళారులకు పెట్టుబడులు
మాపిల్లల చదువులకు కావాలెన్నో బడులు
పాము కాటేస్తే ఎవరినైనా....
ఆ విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేస్తాం!
మా గూడెం లోఎవరికైనా బాధ వొస్తే ..
మా గుండె లో పెట్టి కాచుకుంటాం!
ఆదాయం లేక ఆకలి బాధలు
మలేరియా తో జ్వరాల బాధలు
ఈ సమాజంలో మము చిన్న చూపు చూడొద్దు
సమ సమాజ శ్రేయస్సే అందరికీ ముద్దు
స్మగ్లింగ్ దొంగలకది చీకటి సామ్రాజ్యం
మా ఆది వాసీల కాడి కొట్టిన పిండి
మాగురించి ఎంతోకొంత తెల్సు కోండి .
తేనే పట్టుని వెతికి పట్టి
పట్టు తేనె తుట్టెను కొట్టి
పట్టణాలలో అమ్మి బ్రతుకుతాం
పట్టుదలతో శ్రమించి పనిచేస్తాం.
తుమ్మచెట్ల జిగురు మా జీవనాధారం
చెట్టుకు చిన్న గాటు పెడితే లప్పెడు జిగురు
అది మాజాతివారిని కలిపి ఉంచినా...
మిగిలిన వారితో మమ్ములను కలపలేక పోయింది.
ఔషధ మొక్కలతో మాది
అక్కాచెల్లెళ్ళ అనుబంధం
ఏ మొక్క ఏంటో మొగదల మాకే తెలుసు
మరెందుకో..ంఏమంటే మీకు అలుసు.
వెదురు కర్ర గుడిసెలే మా భవంతులు
మా అజ్ఞానం , అమాయకత్వమే....
మోసపూరిత దళారులకు పెట్టుబడులు
మాపిల్లల చదువులకు కావాలెన్నో బడులు
పాము కాటేస్తే ఎవరినైనా....
ఆ విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేస్తాం!
మా గూడెం లోఎవరికైనా బాధ వొస్తే ..
మా గుండె లో పెట్టి కాచుకుంటాం!
ఆదాయం లేక ఆకలి బాధలు
మలేరియా తో జ్వరాల బాధలు
ఈ సమాజంలో మము చిన్న చూపు చూడొద్దు
సమ సమాజ శ్రేయస్సే అందరికీ ముద్దు
Wednesday, 11 December 2013
చిత్రకారుడు ......కవిత
చిత్రకారుడు
చెక్కు చెదరని ఏకాగ్రత ఉన్న
చిత్రకారుడు మనసు పెట్టి
కాన్వాసు మీద ఓ....
చిత్రానికి జీవం పొయ్యాలి .
గీసిన ఆ చిత్రం కళాత్మకం కావచ్చు
అందరి ప్రశంసలు కురియ వచ్చు
అధ్భుతంగా ఉందని దానికే ...
ఎన్నో అవార్డులు రావచ్చు .
కలగాపులగం లా కొన్ని గీతలు గీసి
దాన్నే మోడరన్ ఆర్ట్ అని అనచ్చు
ఆధునిక చిత్రకళ కదాని మెచ్చుకుని
మరెంతో... ప్రోత్సహించ వచ్చు .
ఓ .. ప్రముఖ రచయిత్రి నవలకు
నీ... చిత్రం 'ముఖచిత్రం 'కావచ్చు
లేక ఏ ధనవంతుని ఇంటికో...
అది 'గోడ చిత్రం' కావచ్చు .
ఏ నాటికైనా కళాకారుని 'దీక్ష' వృధా కాదు
'ఉత్సాహాన్ని' నీవు ఇసుమంతైనా కోల్పోకు
చెక్కు చెదరని 'ఏకాగ్రతను' చెదరనీకు
చెక్కులపై చెక్కుల 'ధనం' వచ్చి చేరు నీకు.
చెక్కు చెదరని ఏకాగ్రత ఉన్న
చిత్రకారుడు మనసు పెట్టి
కాన్వాసు మీద ఓ....
చిత్రానికి జీవం పొయ్యాలి .
గీసిన ఆ చిత్రం కళాత్మకం కావచ్చు
అందరి ప్రశంసలు కురియ వచ్చు
అధ్భుతంగా ఉందని దానికే ...
ఎన్నో అవార్డులు రావచ్చు .
కలగాపులగం లా కొన్ని గీతలు గీసి
దాన్నే మోడరన్ ఆర్ట్ అని అనచ్చు
ఆధునిక చిత్రకళ కదాని మెచ్చుకుని
మరెంతో... ప్రోత్సహించ వచ్చు .
ఓ .. ప్రముఖ రచయిత్రి నవలకు
నీ... చిత్రం 'ముఖచిత్రం 'కావచ్చు
లేక ఏ ధనవంతుని ఇంటికో...
అది 'గోడ చిత్రం' కావచ్చు .
ఏ నాటికైనా కళాకారుని 'దీక్ష' వృధా కాదు
'ఉత్సాహాన్ని' నీవు ఇసుమంతైనా కోల్పోకు
చెక్కు చెదరని 'ఏకాగ్రతను' చెదరనీకు
చెక్కులపై చెక్కుల 'ధనం' వచ్చి చేరు నీకు.
Tuesday, 10 December 2013
'సవ్యసాచి ఓటర్లు'
'సవ్యసాచి ఓటర్లు'
ఉగ్రవాదాన్ని అణచ లేరు
ద్రవ్యోల్బణం అదుపు లో లేదు
సామాన్యుని బ్రతుక్కి భద్రత లేదు
మహిళలకి రక్షణా... లేదు
డాలర్ ఆకాశం లోకి 'దూసుకు' పోతోంది
రూపాయి పాతాళం లోకి 'పడి' పోతోంది .
బొగ్గు స్కాం మసి 'చేతికి' అంటింది
కామన్ వెల్త్ గేమ్స్ 'ఫుట్ బాల్' ఆడు కొన్నాయి
సెకండ్ జెనెరేషన్ స్పెక్ట్రమ్ 'స్కాం' పరువు తీసింది
వికలాంగుల నిధులనూ వదల లేదు మనవారు
ఋణ మాఫీ పథకాలలో రైతు సొమ్ము లూటీ
కుంభ కోణాల్లో మనదేశమే మే... మేటి
అవినీతి కోణాల్లో మనమే ... ఘనాపాటి.
సేవ చేయాలన్న చింతన నాయకుల్లో లోపించింది
స్వార్ధ పు ఆలోచనలు నిరంతరం చిందులు వేస్తున్నాయి.
మార్చుకోవాలి నాయకులు తమ తమ వ్యవహార శైలి
కాదంటే పదవులకే ముప్పు .చేయద్దు మరో సారి తప్పు
ఒక చేతిలో గెలిపించే ఓటు తో
మరోచేతిలో తిరస్కరించే ఓటు తో
అటో... ఇటో ... తేల్చేందుకు
'సవ్యసాచి ఓటర్లు' సిద్ధంగా వున్నారు
ఉగ్రవాదాన్ని అణచ లేరు
ద్రవ్యోల్బణం అదుపు లో లేదు
సామాన్యుని బ్రతుక్కి భద్రత లేదు
మహిళలకి రక్షణా... లేదు
డాలర్ ఆకాశం లోకి 'దూసుకు' పోతోంది
రూపాయి పాతాళం లోకి 'పడి' పోతోంది .
బొగ్గు స్కాం మసి 'చేతికి' అంటింది
కామన్ వెల్త్ గేమ్స్ 'ఫుట్ బాల్' ఆడు కొన్నాయి
సెకండ్ జెనెరేషన్ స్పెక్ట్రమ్ 'స్కాం' పరువు తీసింది
వికలాంగుల నిధులనూ వదల లేదు మనవారు
ఋణ మాఫీ పథకాలలో రైతు సొమ్ము లూటీ
కుంభ కోణాల్లో మనదేశమే మే... మేటి
అవినీతి కోణాల్లో మనమే ... ఘనాపాటి.
సేవ చేయాలన్న చింతన నాయకుల్లో లోపించింది
స్వార్ధ పు ఆలోచనలు నిరంతరం చిందులు వేస్తున్నాయి.
మార్చుకోవాలి నాయకులు తమ తమ వ్యవహార శైలి
కాదంటే పదవులకే ముప్పు .చేయద్దు మరో సారి తప్పు
ఒక చేతిలో గెలిపించే ఓటు తో
మరోచేతిలో తిరస్కరించే ఓటు తో
అటో... ఇటో ... తేల్చేందుకు
'సవ్యసాచి ఓటర్లు' సిద్ధంగా వున్నారు
Subscribe to:
Posts (Atom)