Thursday, 12 December 2013

"బాధ్యత"

అగ్ని కణికల నయనాల
ఆకలి జ్వాలలు . . .
అవి ... కన్నీళ్ళతో
ఆరిపోవు !

కారిన కన్నీళ్ళతో
దాహం తీరదు !
నిండుగ కనిపించే
నీతీ నిజాయితీ
అద్దం పగిలి ముక్కలైంది!

అవినీతి మొక్క పెరిగి
మహా   వృక్ష మైంది
లక్షలాది మందికి
ఆశ్రయ మిస్తోంది !
                                           
అవినీతిని వృక్షాన్ని
పెకలించాల్సిన వాళ్ళు
కొమ్మలు నరికి
విశ్రమిస్తున్నారు!

అవినీతి వృక్షాలముందు
కలుపు మొక్కల్లా
నీతీ నిజాయితీలు
మొకరిల్లుతున్నట్లుంది!

అవినీతిని అంతం...  చే...సి
నీతీ నిజాయితీలను
నిలబెట్టాల్సిన బాధ్యత
భావి భారత పౌరులదే ... సుమా!

"ఉన్నత శిఖరాలు" kavitha

"ఉన్నత శిఖరాలు"

ఎక్కువ జీతం వచ్చిన నాడు
విచ్చలవిడిగా ఖర్చు  చేయకు 
ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాటంటావు 
ఎంట్రెన్సు లో లగ్జరీ కారంటావు
వీకెండ్సు లో విహార యాత్రంటావు
మంతెండ్సు లో ఎంప్టీ పాకెటంటావు

అమ్మానాన్నల పొదుపు పద్దతులు 
దాచిన సొమ్మును వాడిన పద్దతులు 
మరచి పోకుమా...  జీవితమంతా! 
మరచి పోకుమా...  జీవితమంతా!!

అవసరమైనవాటిని
వందెక్కువైన కొనాలి 
ఒకటి కొంటే మూడు ఉచితమన్నా...  
అనవసరమైన వాటిని కొనకు మన్నా!

అమ్మ పొదుపు మాటెత్తితే ... 
అమె పై అరుస్తావ్! 
నాన్న పొదుపు మాటంటే.... 
నాన్న మీద నసుకుతావ్! 
అర్ధాంగి పొదుపు మాటెత్తితే .   
నీకర్ధం కాదు పొమ్మంటావ్!

ఏదో సంపాదిస్తున్నా..కదాని 
పిచ్చిపిచ్చిగా... ఖర్చు చేయకు ..చిన్నా!
నీవు పొదుపు బాట నడవాలని.. 
మంచి మదుపరిగా ఎదగాలని నే కోరుతున్నా!!

అవసరమైన ఖర్చును  ఆపకు 
అనవసరమైన ఖర్చు చేయకు 
నిర్మాణాత్మక పనులకు 
నీ సొమ్మును వినియోగించు .
ఎన్నెన్నో 'ఉన్నత శిఖరాల ' నధిరోహించు   
  

సమ సమాజ శ్రేయస్సే... అందరికీ ముద్దు

పచ్చని ప్రకృతే.. మా ప్రపంచం
స్మగ్లింగ్ దొంగలకది చీకటి సామ్రాజ్యం
మా ఆది వాసీల కాడి కొట్టిన పిండి
మాగురించి ఎంతోకొంత తెల్సు కోండి .

తేనే పట్టుని వెతికి పట్టి
పట్టు తేనె  తుట్టెను కొట్టి
పట్టణాలలో అమ్మి బ్రతుకుతాం
పట్టుదలతో శ్రమించి పనిచేస్తాం.

తుమ్మచెట్ల జిగురు మా జీవనాధారం
చెట్టుకు చిన్న గాటు పెడితే లప్పెడు జిగురు
అది మాజాతివారిని  కలిపి ఉంచినా...
మిగిలిన  వారితో మమ్ములను కలపలేక పోయింది.

ఔషధ మొక్కలతో మాది
అక్కాచెల్లెళ్ళ అనుబంధం
ఏ మొక్క ఏంటో మొగదల మాకే తెలుసు
మరెందుకో..ంఏమంటే మీకు అలుసు.

వెదురు కర్ర గుడిసెలే  మా భవంతులు
మా అజ్ఞానం , అమాయకత్వమే....
మోసపూరిత దళారులకు పెట్టుబడులు
మాపిల్లల చదువులకు కావాలెన్నో బడులు

పాము కాటేస్తే   ఎవరినైనా....
ఆ విషాన్ని నోటితో  పీల్చి ఉమ్మేస్తాం!
మా గూడెం లోఎవరికైనా బాధ వొస్తే ..
మా గుండె లో పెట్టి కాచుకుంటాం!


ఆదాయం లేక ఆకలి బాధలు
మలేరియా తో జ్వరాల బాధలు
ఈ సమాజంలో మము చిన్న చూపు చూడొద్దు
సమ సమాజ శ్రేయస్సే అందరికీ ముద్దు








Wednesday, 11 December 2013

చిత్రకారుడు ......కవిత

చిత్రకారుడు 


చెక్కు చెదరని ఏకాగ్రత ఉన్న 
చిత్రకారుడు మనసు పెట్టి 
కాన్వాసు మీద ఓ....  
చిత్రానికి  జీవం పొయ్యాలి . 

గీసిన ఆ చిత్రం కళాత్మకం కావచ్చు 
అందరి ప్రశంసలు కురియ వచ్చు 
అధ్భుతంగా ఉందని దానికే ... 
ఎన్నో  అవార్డులు రావచ్చు . 

కలగాపులగం లా కొన్ని గీతలు గీసి 
దాన్నే మోడరన్ ఆర్ట్ అని అనచ్చు 
ఆధునిక చిత్రకళ కదాని  మెచ్చుకుని 
మరెంతో... ప్రోత్సహించ వచ్చు . 

ఓ .. ప్రముఖ రచయిత్రి నవలకు 
నీ... చిత్రం  'ముఖచిత్రం 'కావచ్చు
లేక ఏ ధనవంతుని ఇంటికో... 
అది  'గోడ చిత్రం' కావచ్చు . 

ఏ నాటికైనా కళాకారుని 'దీక్ష' వృధా కాదు 
'ఉత్సాహాన్ని' నీవు ఇసుమంతైనా కోల్పోకు 
చెక్కు చెదరని 'ఏకాగ్రతను' చెదరనీకు 
చెక్కులపై చెక్కుల 'ధనం' వచ్చి చేరు నీకు.  








Tuesday, 10 December 2013

'సవ్యసాచి ఓటర్లు'

          'సవ్యసాచి ఓటర్లు'


ఉగ్రవాదాన్ని అణచ లేరు 
ద్రవ్యోల్బణం అదుపు లో లేదు 
సామాన్యుని బ్రతుక్కి భద్రత లేదు 
మహిళలకి రక్షణా... లేదు

డాలర్ ఆకాశం లోకి 'దూసుకు' పోతోంది 
రూపాయి  పాతాళం లోకి 'పడి'  పోతోంది .    
బొగ్గు స్కాం మసి 'చేతికి' అంటింది 
కామన్ వెల్త్ గేమ్స్  'ఫుట్ బాల్' ఆడు కొన్నాయి 
సెకండ్  జెనెరేషన్ స్పెక్ట్రమ్  'స్కాం'  పరువు తీసింది 


వికలాంగుల నిధులనూ  వదల లేదు మనవారు 

ఋణ మాఫీ పథకాలలో రైతు సొమ్ము లూటీ 
కుంభ కోణాల్లో మనదేశమే మే...  మేటి 
అవినీతి కోణాల్లో మనమే ... ఘనాపాటి. 


సేవ చేయాలన్న చింతన నాయకుల్లో  లోపించింది

స్వార్ధ పు ఆలోచనలు నిరంతరం చిందులు వేస్తున్నాయి. 
మార్చుకోవాలి నాయకులు తమ తమ వ్యవహార శైలి 
కాదంటే పదవులకే ముప్పు .చేయద్దు మరో సారి తప్పు 


ఒక చేతిలో గెలిపించే ఓటు తో 
మరోచేతిలో తిరస్కరించే ఓటు తో 
అటో...  ఇటో ... తేల్చేందుకు 
'సవ్యసాచి ఓటర్లు' సిద్ధంగా వున్నారు    


Monday, 18 November 2013

అనాదిగా ఆడ జన్మ

              అనాదిగా       ఆడ జన్మ 

          పెళ్లి అంటే నే తెలియని వయసు  నాది
         వయసు రాక ముందే చేశారు నాకు పెళ్లి  
         నాకు వయసు వచ్చే సరికి వయసు మళ్ళి 
         కాలం చేశారుఆయన   కొన్నాళ్ళ కి
         సతీ సహగమనమని.. బ్రతి కుండగానే
         చితిపై పెట్టి దహనం చేశారునన్ను. 
         చచ్చినట్లు .. చచ్చి ఇక్కడి కొచ్చా
         నంది ఓ ముత్తవ్వ పిశాచి . 

        బాల్య వివాహాలని చెప్పి,ముసలోని కిచ్చి పెళ్లి చేసి 
        ఆయన కాలం చేసినాక , గుండు చేసి
        పసుపు కుంకుమలకు నన్ను దూరము  చేసి 
        మిగిలిన జీవితమంతా ఇంటికే పరిమితం చేసి
       ఒక్క సారి చావకుండా  జీవితమంతా చంపారు
       ముసలి దాన్నై  చివరికి చచ్చి నట్లు చచ్చి 
       ఇక్కడి కొచ్చా నంది  అవ్వ పిశాచి. 

      బాల్య వివాహా లొద్దని వయసొచ్చి నాక పెళ్ళిళ్ళని .. 
      పెళ్ళిళ్ళు చేస్తే స్వతంత్ర భావాలు ఎక్కువై నాయి
      ఆలు మగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది
      ఆడపడచుల జోక్యం ఎక్కు వైయ్యింది 
      ఆలు మగల మధ్య దూరం పెరిగింది . 
      అవకాశం  చూసి అందరూ కలిసి 
      నా పై కిరోసిన్  పోసి నిప్పు పెట్టారు
      చచ్చినట్లు .. చచ్చి ఇక్కడికి వచ్చానంది  అమ్మ పిశాచి . 

       ప్రేమా..  దోమా..  అని ఇంటిలో చెప్పక
       లవ్ మారేజంటూ ఇల్లు వదలి
       అటు ఇటు కాకుండా జీవితాన్ని కోల్పోయి
       ఏమీ చేయ లేక ... తిరిగి ఇంటికి  వెళ్ళలేక
       ఆత్మహత్య చేసి కొని పిరికి దద్దమ్మ లాగా
       చచ్చినట్లు చచ్చి .. ఇక్కడికి వచ్చా నంది  పిల్ల పిశాచి.

       తల్లి తండ్రి కలిసి ప్రేమగా మెలిగి  
       అమ్మ గర్బవతియని తెలిసి పొంగిపోయి 
      కడుపున అడ పిల్లయని తెలిసి కృంగిపోయి 
       అబోర్షన్  చేయించి చంపి వేయగా  నన్ను
       చచ్చినట్లు చచ్చి .. ఇక్కడికి వచ్చానంది  భ్రూణ  పిశాచి.









Saturday, 16 November 2013

'నా .. అన్న వాళ్ళు'



 కస్సు బస్సు అని కసురుకోక 
తీయగా ఎపుడు మాట్లాడు తుంటే 
నాకు 'చక్కెర వ్యాధి' లేదని నెత్తి
 నోరు మొత్తుకున్నా గాని 
నమ్మనేనమ్మరు నాకాలొనీ వాసులు 

ఆఫీసు లోన నేను
ఎవరిని తిట్టనేనని 
'రక్త పోటు' అధికమని 
నే నెత్తి నోరు మొత్తుకున్నాగాని  
నమ్మనే నమ్మరు నా తోటి వారు. 

ఎవరెన్ని అన్నాఎదురు చెప్పకుండా 
పట్టి పట్టనట్టు ఉంటానని తెలిసి 
నెత్తి నోరు మొత్తుకున్నా గాని 
ఎలా పసిగట్టారో గాని జనం 
నాకు' బ్రహ్మ చెము'డుం దని 

ఇంటి ' సంపెంగ పూవు'
నా 'ఇంతి' కొప్పున జూసి 
వాసనే లేదని వెక్కిరింప 
ఘ్రాణ శక్తి కూడా చంక నాకెననుచు 
గేలి చేసిరి నన్ను 'నా .. అన్న వాళ్ళు' 


TV SERIAL ADDICTION


Friday, 15 November 2013

మన హరిదాసులు.


కను బొమ్మల మధ్య నుండి 

నడి నెత్తి వరకు కన్పించే 

తిరు చూర్ణపు బొట్టు 

మంచి గుమ్మడి కాయ లాంటి 

తళతళ మెరిసే అక్షయపాత్ర 

ఆ పాత్ర చుట్టూ పూలమాలాంకరణ

దాన్ని నెత్తిన కదలకుండా నిలిపే  నేర్పు 

మన హరిదాసుల సొంతం 

కాళ్ళకి ఘల్లు ఘల్లు మనే గజ్జల కట్టుతో

రంగు రంగు ల వస్త్ర ధారణతో

ప్రతి ఇంటి ముందు చిందులు తొక్కుతూ

రెండు చేతులా చిడతలు కొడుతూ 

హరిలో రంగ హరీ అని కీర్తనలు పాడుతూ

దానం చేసినోళ్ళని కృష్ణార్పణం అని దీవిస్తూ ...
.
యాంత్రిక జీవనం లోని మనకు 

ప్రతి
సంక్రాంతికి  నూతనోత్సాహమును నింపు . 

   




Sunday, 3 November 2013

MONDI BAAKI VASOOL


REMOTE CARTOON


GUDI BANDA CARTOON


MARADALU BOMB


ICU CARTOON


marchury


DEEVAALI SNAKE CARTOON


abbayi cartoon


TIRUMALA GUNDU CARTOON


KANTHAM SWETTER


PUBLISHED IN HASYANANDAM MONTHLY DECEMBER 2013 ISSUE.

TALI BOTTU PISACHI


NAGULA CHAVITHI CARTOON

PUBLISHED IN GOTELUGU .COM

PALUKURU CARTOON


GUDI BANDA CARTOON


Saturday, 12 October 2013

ప్రేమ కి అక్షరాలు రెండైనా... ప్రపంచం ఒకటే


ప్రేమ కి అక్షరాలు రెండైనా... ప్రపంచం ఒకటే
ప్రేమ స్వచ్ఛమైనది  గా ఉండాలి
ప్రేమ అభిమానం తో కూడినదై ఉండాలి
ప్రేమ ఆప్యాయతను పంచేదై  ఉండాలి!

యుక్త వయసులో ఆడా మగ పిల్లల
ఇద్దరి మధ్య ప్రేమ సహజం
ఆకర్షణ తో మొదలయ్యే ప్రేమ...  ప్రేమ కాదు
అనుమానం తోకూడిన ప్రేమ అర్ధాంతమే సుమా!


ఆ ప్రేమలో కల్మషము ఉండకూడదు
ఆ ప్రేమని స్వార్ధానికి వాడుకోకూడదు
ఆ ప్రేమలో అరమరికలు ఉండకూడదు
ఆ ప్రేమ కోర్కెలు తీర్చే పథకం కాకూడదు!


ప్రేమ అనేది పెదవులనించి గాదు.. హృదయం నుండి పుట్టాలి
ప్రేమ అనేది  మంచి స్నేహితుల మధ్య మొదలౌతుంది
ప్రేమ అనేది మనసుకు సంబందించినదై  ఉండాలి
ప్రేమ అనేది అనురాగాన్ని పంచాలి !

ఒక ప్రక్కనే ఉండే ప్రేమ...  ప్రేమ కాదు
స్పర్శని కోరే ప్రేమా ...  ప్రేమ కాదు
స్పర్శ ని కోరని ప్రేమ ఎంతకాలం నిలిస్తే
ప్రేమ అంత గొప్పదని .. గొప్ప ప్రేమికులంటారు !