హాస్యమా ? అపహాస్యమా?
ఆనాటి హాస్యం ఎంత బాగుండేది
ఒక సంభాషణ లో ఒక నవ్వు
ఒక సన్నివేశం లో ఒక నవ్వు
అంతెందుకు?
ప్రతి కదలిక లో ఒక నవ్వు
ప్రతి మాట లో ఒక నవ్వు..
పేకేటి..రేలంగి...రమణారెడ్డి
రాజబాబు..అల్లూ రామ లింగయ్య.
హాస్యానికి మారు పేరు ఆనాడు
నేటి హాస్యం అపహాస్యం అవుతోంది
మక్కె లిరిగేలా కొట్టుతుంటే
జనం చూసి ... నవ్వు తున్నారు
సామాన్యులను అవహేళణ
చేస్తుంటే ..చప్పట్లు కొడుతున్నారు.
ఈవ్ టీజింగ్ చేస్తుంటే
ఈలలు వేస్తున్నారు .
ఆడ పడుచులని
ప్రేమించమని ..వేధిస్తుంటే
వెఱ్ఱి నవ్వు ... నవ్వుతున్నారు .
ఇది హాస్యమా?
అపహాస్యమా?