Wednesday, 15 March 2017

క్రొత్త. . .. కొంగ్రొత్త ఆశల పల్లకి . ( HEVALAMBI ugadi kavitha)

క్రొత్త. . .. కొంగ్రొత్త  ఆశల  పల్లకి .
చెట్లు ఆకులు రాల్చెను
చైత్ర మాసాన్ని ఆహ్వానిస్తున్నట్లు
వేప
చెట్టు విరగబూసి.. గాలికివూగె
నెమలి పురి విప్పి ఆడి నట్లు
చిగురు టాకుల,చిరు మామిడి పిందెల
చెట్టు
కొమ్మల చాటున
దాగిన
కోయిలమ్మల తీయని
గొంతుకల
  స్వాగత గీతాలు
' హేవిళంబి ' ఉగాది  రాకకై ..
తెలుగు ప్రజల ఎదురు చూపులు
ఉగాది పచ్చడి లో...
నోరూరించే
షడ్రుచులు

అది... పాత  ఉగాది
మీ శ్రమ కు ముగింపు.. అది
వచ్చెనదిగో
..  .. హేవిళంబి
 
క్రొత్త. . .. కొంగ్రొత్త  ఆశల  పల్లకి .

Monday, 6 February 2017

హాస్యమా ?  అపహాస్యమా? 

ఆనాటి హాస్యం ఎంత బాగుండేది
ఒక సంభాషణ లో ఒక నవ్వు
ఒక సన్నివేశం లో ఒక నవ్వు
అంతెందుకు? 

ప్రతి కదలిక లో ఒక నవ్వు
ప్రతి మాట లో ఒక నవ్వు..
పేకేటి..రేలంగి...రమణారెడ్డి
రాజబాబు..అల్లూ రామ లింగయ్య.
హాస్యానికి మారు పేరు ఆనాడు 

నేటి హాస్యం  అపహాస్యం అవుతోంది 
మక్కె లిరిగేలా కొట్టుతుంటే 
జనం చూసి ... నవ్వు తున్నారు  
సామాన్యులను అవహేళణ 
చేస్తుంటే ..చప్పట్లు  కొడుతున్నారు. 
 
ఈవ్ టీజింగ్ చేస్తుంటే 
ఈలలు వేస్తున్నారు . 
ఆడ పడుచులని 
ప్రేమించమని ..వేధిస్తుంటే 
వెఱ్ఱి నవ్వు ... నవ్వుతున్నారు . 
 
ఇది హాస్యమా?
అపహాస్యమా?