పరవశం
నేతి బీరకాయ లో
నెయ్యి లేదు
కుక్క బిస్కెట్ లో
కుక్క లేదు
ప్లాస్టిక్ పూలకి
వాసన లేదు
ఆ రంగు పూలకి హంగే గానీ
పరిమళాల పసే ... లేదు!
కొండ మల్లె మొక్క
పూలు చూడరో యక్కా ..
మత్తెక్కించు ...
మనకు ఎంచక్కా !
వాడదు వారమైనా ..
కోయకుంటే..
పంచుతుంది పరిమళం
అది అంతేలేని పరవశం !