ఎక్కువ జీతం ... వచ్చిన నాడు
విచ్చల విడిగా ... ఖర్చు చేయకు
ఫైవ్ బెడ్ రూం... ఫ్లాటంటావు
ముంగిట... లగ్జరీ కారంటావు
వీకెండ్స్ లో... విహర యాత్ర లంటావు
మంతెండ్స్ లో... ఎంప్టీ పాకెటంటావు .
అమ్మా నాన్నల పొదుపు పద్దతులు
పొదుపు సొమ్మును వాడిన పద్దతులు
మరచి పోకుమా... జీవితమంతా !
అమ్మ పొదుపు మాటంటే... ఆమె పై అరుస్తావ్!
నాన్న పొదుమాటంటే... మీ నాయనపై నసుగుతావ్!
అర్ధాంగి పొదుపు చేయమంటే ....
నీకర్ధంకాదుపొమ్మంటావ్!
అవసరమైన వాటిని వందె క్కువైన కొనాలి
ఒకటికి రెండు ఉచిత మన్నా ...
అనవసరమైన వాటిని కొనకుమన్నా!
ఏదో... బాగా సంపాదిస్తున్నానని
పిచ్చి పిచ్చిగా... ఖర్చు చేయకు చిన్నా...
నీవు పొదుపు బాట నడవాలని
మంచి మదుపరిగా ఎదగాలని ...
నేను మనసారా కోరుతున్నా ! ! !