Thursday, 17 July 2014
Thursday, 24 April 2014
Monday, 21 April 2014
Monday, 7 April 2014
Tuesday, 7 January 2014
మనసారా కోరుతున్నా...
ఎక్కువ జీతం ... వచ్చిన నాడు
విచ్చల విడిగా ... ఖర్చు చేయకు
ఫైవ్ బెడ్ రూం... ఫ్లాటంటావు
ముంగిట... లగ్జరీ కారంటావు
వీకెండ్స్ లో... విహర యాత్ర లంటావు
మంతెండ్స్ లో... ఎంప్టీ పాకెటంటావు .
అమ్మా నాన్నల పొదుపు పద్దతులు
పొదుపు సొమ్మును వాడిన పద్దతులు
మరచి పోకుమా... జీవితమంతా !
అమ్మ పొదుపు మాటంటే... ఆమె పై అరుస్తావ్!
నాన్న పొదుమాటంటే... మీ నాయనపై నసుగుతావ్!
అర్ధాంగి పొదుపు చేయమంటే ....
నీకర్ధంకాదుపొమ్మంటావ్!
అవసరమైన వాటిని వందె క్కువైన కొనాలి
ఒకటికి రెండు ఉచిత మన్నా ...
అనవసరమైన వాటిని కొనకుమన్నా!
ఏదో... బాగా సంపాదిస్తున్నానని
పిచ్చి పిచ్చిగా... ఖర్చు చేయకు చిన్నా...
నీవు పొదుపు బాట నడవాలని
మంచి మదుపరిగా ఎదగాలని ...
నేను మనసారా కోరుతున్నా ! ! !
మినీ కవితలు
అప్పు
అవసరానికి అప్పు
దొరికిందాకా తిప్పు తుంది
దొరికిన తర్వాత అప్పిచ్చినోడికి
దొరక కుండా తిప్పుతుంది.
మానవుడు
సత్యం ధర్మం అన్నరెండు
పాదాలమీద నడిచేవాడే కానీ
మృగంలాగా నాలుగు
పాదాలమీద నడిచే వాడు కాదు.
నిద్ర
పరీక్షా సమయంలో
విద్యార్ధులను వెంటాడేది
సర్వం పోగొట్టుకున్నా
బలవంతునితో తలపడ్డా రానిది.
అవసరానికి అప్పు
దొరికిందాకా తిప్పు తుంది
దొరికిన తర్వాత అప్పిచ్చినోడికి
దొరక కుండా తిప్పుతుంది.
మానవుడు
సత్యం ధర్మం అన్నరెండు
పాదాలమీద నడిచేవాడే కానీ
మృగంలాగా నాలుగు
పాదాలమీద నడిచే వాడు కాదు.
నిద్ర
పరీక్షా సమయంలో
విద్యార్ధులను వెంటాడేది
సర్వం పోగొట్టుకున్నా
బలవంతునితో తలపడ్డా రానిది.
మినీ కవితలు
కామం
ప్రేమ పేరు తో
లొంగ దీసుకునేది
కోరిక దీరాక
వంచించేది.
నిజం
ఆలోచించకుండా చెప్పేది
అన్ని వేళలా చెప్ప దగినది
ఎప్పటికీ నిలచి వుండేది అయినా
అందరూ ధై ర్యంగా చెప్పలేనిది.
ధైర్యం
జీవితం లోవుండాల్సినది
కష్ట కాలం లో పనికొచ్చేది
ఎన్నటికీ కొల్పోకూడనిది
పిరికి వానికి దక్కనిది .
Subscribe to:
Posts (Atom)