అనాదిగా ఆడ జన్మ
పెళ్లి అంటే నే తెలియని వయసు నాది
వయసు రాక ముందే చేశారు నాకు పెళ్లి
నాకు వయసు వచ్చే సరికి వయసు మళ్ళి
కాలం చేశారుఆయన కొన్నాళ్ళ కి
సతీ సహగమనమని.. బ్రతి కుండగానే
చితిపై పెట్టి దహనం చేశారునన్ను.
చచ్చినట్లు .. చచ్చి ఇక్కడి కొచ్చా
నంది ఓ ముత్తవ్వ పిశాచి .
బాల్య వివాహాలని చెప్పి,ముసలోని కిచ్చి పెళ్లి చేసి
ఆయన కాలం చేసినాక , గుండు చేసి
పసుపు కుంకుమలకు నన్ను దూరము చేసి
మిగిలిన జీవితమంతా ఇంటికే పరిమితం చేసి
ఒక్క సారి చావకుండా జీవితమంతా చంపారు
ముసలి దాన్నై చివరికి చచ్చి నట్లు చచ్చి
ఇక్కడి కొచ్చా నంది అవ్వ పిశాచి.
బాల్య వివాహా లొద్దని వయసొచ్చి నాక పెళ్ళిళ్ళని ..
పెళ్ళిళ్ళు చేస్తే స్వతంత్ర భావాలు ఎక్కువై నాయి
ఆలు మగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది
ఆడపడచుల జోక్యం ఎక్కు వైయ్యింది
ఆలు మగల మధ్య దూరం పెరిగింది .
అవకాశం చూసి అందరూ కలిసి
నా పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు
చచ్చినట్లు .. చచ్చి ఇక్కడికి వచ్చానంది అమ్మ పిశాచి .
ప్రేమా.. దోమా.. అని ఇంటిలో చెప్పక
లవ్ మారేజంటూ ఇల్లు వదలి
అటు ఇటు కాకుండా జీవితాన్ని కోల్పోయి
ఏమీ చేయ లేక ... తిరిగి ఇంటికి వెళ్ళలేక
ఆత్మహత్య చేసి కొని పిరికి దద్దమ్మ లాగా
చచ్చినట్లు చచ్చి .. ఇక్కడికి వచ్చా నంది పిల్ల పిశాచి.
తల్లి తండ్రి కలిసి ప్రేమగా మెలిగి
అమ్మ గర్బవతియని తెలిసి పొంగిపోయి
కడుపున అడ పిల్లయని తెలిసి కృంగిపోయి
అబోర్షన్ చేయించి చంపి వేయగా నన్ను
చచ్చినట్లు చచ్చి .. ఇక్కడికి వచ్చానంది భ్రూణ పిశాచి.
పెళ్లి అంటే నే తెలియని వయసు నాది
వయసు రాక ముందే చేశారు నాకు పెళ్లి
నాకు వయసు వచ్చే సరికి వయసు మళ్ళి
కాలం చేశారుఆయన కొన్నాళ్ళ కి
సతీ సహగమనమని.. బ్రతి కుండగానే
చితిపై పెట్టి దహనం చేశారునన్ను.
చచ్చినట్లు .. చచ్చి ఇక్కడి కొచ్చా
నంది ఓ ముత్తవ్వ పిశాచి .
బాల్య వివాహాలని చెప్పి,ముసలోని కిచ్చి పెళ్లి చేసి
ఆయన కాలం చేసినాక , గుండు చేసి
పసుపు కుంకుమలకు నన్ను దూరము చేసి
మిగిలిన జీవితమంతా ఇంటికే పరిమితం చేసి
ఒక్క సారి చావకుండా జీవితమంతా చంపారు
ముసలి దాన్నై చివరికి చచ్చి నట్లు చచ్చి
ఇక్కడి కొచ్చా నంది అవ్వ పిశాచి.
బాల్య వివాహా లొద్దని వయసొచ్చి నాక పెళ్ళిళ్ళని ..
పెళ్ళిళ్ళు చేస్తే స్వతంత్ర భావాలు ఎక్కువై నాయి
ఆలు మగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది
ఆడపడచుల జోక్యం ఎక్కు వైయ్యింది
ఆలు మగల మధ్య దూరం పెరిగింది .
అవకాశం చూసి అందరూ కలిసి
నా పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు
చచ్చినట్లు .. చచ్చి ఇక్కడికి వచ్చానంది అమ్మ పిశాచి .
ప్రేమా.. దోమా.. అని ఇంటిలో చెప్పక
లవ్ మారేజంటూ ఇల్లు వదలి
అటు ఇటు కాకుండా జీవితాన్ని కోల్పోయి
ఏమీ చేయ లేక ... తిరిగి ఇంటికి వెళ్ళలేక
ఆత్మహత్య చేసి కొని పిరికి దద్దమ్మ లాగా
చచ్చినట్లు చచ్చి .. ఇక్కడికి వచ్చా నంది పిల్ల పిశాచి.
తల్లి తండ్రి కలిసి ప్రేమగా మెలిగి
అమ్మ గర్బవతియని తెలిసి పొంగిపోయి
కడుపున అడ పిల్లయని తెలిసి కృంగిపోయి
అబోర్షన్ చేయించి చంపి వేయగా నన్ను
చచ్చినట్లు చచ్చి .. ఇక్కడికి వచ్చానంది భ్రూణ పిశాచి.