Thursday, 12 September 2013

మన తెలుగు బాషలో 
 ఋ, ఋ ఊ .. అలు,  అలూ .లు
అనే   అచ్చులు చచ్చి పోయాయి 
నాటి  ఋషి......  నేడు..  రుషి  గా మారి  పొయ్యాడు
 ఙ , ళ , ఱ.. ..  హల్లులు  క్రమంగా  కనుమరుగవుతున్నాయి
కొన్ని  అక్షరాలు తమ ఉనికిని కోల్పోతున్నాయి 
నేడు పెళ్ళి.. అనే పదాన్ని .. . పెల్లి -   అని అంటున్నారు
 జ్ఞ - ఞ   ల వాడకం పూర్తిగా మానేశారు

ఒకనాటి గుఱ్ఱము నేడు .. గుర్రము గా మారి పోయింది
ఇంకా తెలుగు బాష  కేమవుతుందోనని ...
తలచుకుంటే .. గుండెల్లో గుబులౌతోంది .









బ్రాహ్మం

ప్రతిఫల రహితంగా యోగ్యుడైన వరునకు అలంకరించబడిన కన్య ను ఇచ్చి వివాహం చెయ్యడం.. తలిదండ్రులు శక్తి కొలది వస్త్రభూషణాదులతో తమ కూతురు ను అలంకరించి తగిన సమర్దుడైన వరుని చూసి కూతురి చేతిని అతని చేతిలో కలపి పాణిగ్రహణం చేస్తారు.

దైవం

యజమాని గృహంలో దైవ యజ్ఞం చేసి యజ్ఞాంతములో ఋత్విజునికి ధారాపూర్వకంగా కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.

ప్రాజాపత్యం

కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. వదూవరులు ఒకచోట సుఖంగా ధర్మాచరణ చేసుకొంటూ జీవిస్తారనే బుద్దితో వరునికి కన్యనిచ్చి వివాహం చేయడం. ఈ ప్రక్రియలో కట్నం, కన్యాశుల్కం అనే ప్రశక్తి ఉండదు.

ఆర్షం

వేదవిహితంగా చేసుకునే వివాహం. కన్య తల్లి దండ్రులకు వరుడు కొన్ని ఉపకరణాలు అనగా ఆవు లేదా ఎద్దు లేదా కొన్ని మేకలు ఇలా ఇచ్చి కన్యను/కన్యాదానమును గ్రహించడం.

ఆసురం

వదువు వైపువారికి శుల్కమును/ధనము ఇచ్చి కన్యాధానము గ్రహించడం.

గాంధర్వం

వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టముతో పాణిగ్రహణము చేసుకొనడం.

పైశాచం

కన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహం. వదువు ఏమరుపాటుగా ఉన్నపుడు గాని, నిద్రిస్తున్నపుడు గాని, చేసుకొనే ఈ వివాహాన్ని అధమాధమమైనదిగా పరిగణిస్తారు.

రాక్షసం

కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహాలు పలు పురాణాలలో కానవస్తాయి.

ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్కస్మృతిలో కానవస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో స్వయంవరం అనే మరొక సాంప్రదాయ వివాహం చూడచ్చు. శివదనుస్సును విరిచి శ్రీరాముడు సీత ను పెళ్ళాడినది. మత్యయంత్రమును ఎక్కుపెట్టీ ద్రౌపదిని అర్జునుడు చేపట్టినది


                    

Wednesday, 11 September 2013

బల్లి పాటు ఫలితము

                     

బల్లి పాటు ఫలితములు తెలుసుకుందాం!
                     

శిరస్సున బల్లి పడితే                                    .................. కలహం
ముఖము మీద పడితే                                 .................. బందు దర్శనం        
ఫై పెదవి మీద పడితే                 .................. .................. ధనావ్యయం
క్రింద పెదవి మీద పడితే                               .................. ధనలాభం
ముక్కు చివరన పడితే                                 .................. రోగం
కుడి చెవి మీద పడితే                                   .................. దీ ర్ఘాయువు
ఎడమ చెవి మీద పడితే                                .................. వ్యాపార లాభం
కంటి  మీద పడితే                                        .................. ఖైదు
ముంగురుల మీద పడితే                              ................. శిక్ష
నుదిటి మీద పడితే                                     .................. భయము
కంరముమీద పడితే                                   .................. శత్రువు హాని
ఎడమ భుజముమీద పడితే                         .................. స్త్రీ భోగము
కుడి మణి కట్టు మీద పడితే                         .................. కీర్తి
స్తనముల మీద పడితే                                .................. దోషము
కడుపు మీద పడితే                                    .................. ధనా లాభము
నాభి మీద పడితే                                       .................. ధనా లాభము
పార్శ్వముల మీద పడితే                             .................. లాభము
తొడల మీద పడితే                                      .................. పిత్రార్జితం  లాభిస్తుంది
ప్రక్కల యందు                                          .................. సుఖము
కాళ్ళమీద పడితే                                        .................. ధన వ్యయం
లింగముమీద పడితే                                    .................. దారిద్రం
జుట్టు చివరన మీద పడితే                           .................. మృత్యు భయం
తలమీద నుండి క్రిందకు దిగినట్లయితే            .................. హాని
      
క్రింద నుండి పైకి పాకి,
ప్రాకిన వెంటనే క్రింద కు దిగిన చో .................. మంచిది


   శరీరం ఫై ఏ భాగం లో బల్లి పడి నా,  వెంరనే తల  స్నానము చేసి, నువ్వు ల నూనెతో దేవుని ముందు దీపారాధన  చేసి,  ఇష్ట దైవ ప్రార్థన చేసుకొన్నట్లయితే   దోష నివారణవుతుందని పెద్దలు చెపుతారు.