మహాను భావుడు
(ఒక పేజీ కథ )
చల్లగాలి వీస్తోంది..వర్షమొచ్చే సూచనలు కన్పిస్తున్నాయి...కాస్త టీ ఉంటే వేడి చేసి ఇస్తావా? పద్దూ... అన్నాడు కాశి. అయ్యో! ..ఇంతకు ముందే పని అమ్మాయి పోచి తలనొప్పిగా ఉందంటే టాబ్లెట్ ఇచ్చి టీ ఇచ్చేశానండి.సండే గదా పాలన్నీ ఖర్చయిపోయాయి.ఏమనుకోకుండా కొంచెం బైటికెళ్లి టీ త్రాగి రండి ఈరోజుకిఅన్నది పద్దు. అనుకునే దేముందిరా! అలాగే ..టీ త్రాగి వస్తానంటూ బైటికి వెళ్లాడు కాశి.
బాబూ..ఓ సింగిల్ టీ స్స్ట్రాంగ్ గా ఇవ్వు అని అడిగాడు కాశి టీ స్టాల్ వాడిని.టీ స్టాల్ ప్రక్కనే ఓ బట్టలు ఐరన్ చేసే షాప్ ఒకటి ఉంది. అందులోఒక బాబు బహుశ మూడేళ్ళుండచ్చువాడికి. 'నా పిల్లవాడిని నాకివ్వండి మీ రడిగి నట్లు మా ఇంటికి పోయి, మానాన్నకి ఏదో ఒకటి చెప్పి, గ్యాస్ పొయ్యి కి కావల్సిన పైసలు తెస్తాను అంటోంది' భర్తతో. నీ పిల్లవాడేంటి .పైసలు తెచ్చినాకే పిల్లాడైనా... గిల్లాడైనా... అన్నాడు మొగుడు.ఆ షాపు లోపలికి పోడానికి ఉన్న చిన్న దారి లో ఐరన్ బాక్స్ కోసం కాబోలు... బొగ్గులు కొన్ని కుప్పగా పోసి నిప్పు అంటించాడు. అడుగు కు పైగా మంటలు ఎగసి అడుతున్నాయి.చివరి సారిగా అడుగుతున్నా...నాకు బాబునిస్తావా?లేదా?ఏంటే నీకిచ్చేది అంటూ ముక్కు మీదా,మూతి మీదా రెండుసార్లు ,దవడ మీద రెండు సార్లు తీవ్రంగా కొట్టాడు. క్షణాల్లో పై పెదవి వాచి పోయింది .ముక్కు నుంచి రక్తం ధారాపాతంగా కారి పోతోంది. ఏయ్! అని అరిచాడు అప్రయత్నంగా ఇదంతా చూస్తున్న కాశి.
'సార్ ! మీరు కొంచెం ఇటు వైపుకు రండి. మీకు టీ ఇచ్చి చాలా సేపయ్యింది. త్రాగి పోండి .ఇవన్నీ మాకు మామూలే!' అన్నాడు టీ స్టాల్ ఓనర్. అంతలో ఓ పెద్దమనిషి అయ్యప్ప దీక్ష లో ఉన్నడనుకొంటా..నల్ల డ్రెస్సు లోఉన్నాడు 'ఏరా ! ఇంక ఇక్కడ కొట్టొద్దు. ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర చూసుకో దాని సంగతి' అన్నాడు ఆయన, మళ్లీ కొట్ట బోతున్న కొడుకుతో. దీనంగా రోదిస్తున్న ఆమెను చూసి చలించి పోయాడు కాశి.చల్లగా అయిపోయిన టీ ని ప్రక్కన పోసి, షాపు వానికి ఐదు రూపాయిలిచ్చి,అన్య మనస్కంగా ఇంటికి పోయాడు.భార్య తలుపు తీయంగానే ఏంటండీ..ఏదోలా ఉన్నారు? ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. జరిగిందీ.. చూచిందీ... వివరంగా చెప్పాడు భార్యకి. నేనైతే పోలీసులకి కంప్లైంట్ ఇద్దామను కొన్నా పద్దూ. ఒద్దండీ.. మనకెందుకు మధ్యలో రేపేమన్నాఐతే... కోర్టుల చుట్టూ మనం తిరగాలిఅంది. మనం ఎంత అన్యోన్యంగా ఉన్నాము. నాకేమైనా అయితే నీవెంత బాధ పడతావు. నీకేమైనా జరిగితే నేనెంత ఆందోళన చెందుతానో నీకు తెలుసుగదా!మరి భార్యా భర్తలన్న తరువాత అందరూ అలాగే ఉండాలి గదా! మరి. . ఆ ఐరన్ షాపు వాని భార్య గుట్టలు గుట్టల బట్టలు ఐరన్ చేసి తెచ్చి ఇస్తుంది గదా! పెరిగిన రేట్ల తో సంపాదన కూడా బాగానే ఉంది కదా! ఒక ప్రక్క చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే ..వాడు నిర్దక్షిణ్యంగా భార్యను చితక బాదుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ ఆపడానికి రాలేదు. ప్రక్కనే.. చాలా మంది చోద్యం చూస్తూ.. టీ త్రాగు తున్నారు . పద్దూ.. పద్దూ..ఏమిటీ మాట్లాడవంటూ ప్రక్కకు తిరిగాడు కాశి ఆమె లేదు. ఇంత సేపు ఒక్కడే.. తనకుతనే.మాట్లాడుకున్నాడన్నమాట.
ఒక్కడే నవ్వు కుంటూన్నాడు..కోపమంతా ఎక్కడకు పోయిందో.
తలుపు చప్పుడయ్యింది అటు తిరిగి చూచాడు. భార్య కళ్లల్లో ఎంత అనందమో!ఏంటి? చెప్పు త్వరగా.. అన్నాడు కాశి. ఏంలేదండీ... మన ఐరన్ షాపు వాడ్ని పోలీసులొచ్చి అరెస్టు చేసి తీసికెళ్లారట.ఎవరో మహానుభావుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడట. తగిన శాస్తే జరిగింది. ఇంత క్రితం నేను గూడా ఒక సారి గుడి నుంచి వస్తూ.. వస్తూ ..చూశా. ఆమె మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ.. ఉంది. నే నేం చేయ గలను? అందు కే తల వంచుకుని నాదారిన నేను వచ్చేశానండీ! అంది పద్దూ. ఆ మహానుభావుడు తన భర్తేనని పాపం పద్దూకి తెలియదు.