Tuesday, 30 July 2013

నువ్వొక.. తాజ్ మహల్ వి .

జీవం దాగున్న పదం ..  ప్రేమ 
పరకాయ ప్రవేశం చేసి..  పరాన్నజీవి లాగా జీవిస్తుంది
ప్రేమికుల హృదయం లో ఉద్భవించి .. . 
ప్రేమికుల అధరాల నుంచి జాలువారే ఆణిముత్యమే  ప్రేమ. 
అలా జారి పడిన ' ప్రేమ' అనే పదాని కే  అర్ధం..  పరమార్ధం. 
ఒకానొక క్షణం లో హఠాత్తుగా కల్గిన అనుభూతి..  ప్రేమ 
తొలి స్పర్శ  ప్రేమ కు దారి తీయ వచ్చు.. . ప్రకృతి పరంగా 
ప్రేమ..  ప్రేమికుల గుండెల్లో సహజీవనం చేస్తుంది..  
ప్రేమ కున్నదల్లా ఒకటే ఒక జాడ్జ్యం (రోగం)
అది ప్రేమ జంట లో ఒకరి నే .. . వరిస్తుంది
ఇంకొకరి కై పరితపిస్తుంది.. . మహా వేధిస్తుంది 
ప్రేమ వరించిన వారిని నిదుర  పోనివ్వదు .. నీళ్ళూ త్రాగనివ్వదు
విషయ వాంఛలూ, ఐహిక సుఖాలూ 
ప్రేమని నిలువునా.. . హత్య చేస్తున్నాయి  
నీ పేరుని వాడుకుని కోర్కెలు తీర్చుకుంటున్నారు 
చాలావరకు నీ పవిత్రత ని భ్రష్టు పట్టిస్తున్నారు
నీకు అప్రతిష్ట ని తెస్తున్నారు. . నేటి యువత.
ఇక నైనా నిజమైన ప్రేమికులకు చేయూత నివ్వు.. 
ప్రేమికుల మది లో నువ్వొక సుందర స్వప్నానివి .. 
ప్రేమికుల చూపు లో.. నువ్వొక తాజ్ మహల్ వి .



 

Sunday, 28 July 2013

గుబులు


                                 గుబులు 



ఒకనాటి భారత దేశానికీ.. . నేటి భారత దేశానికీ ఎంత తేడా !

ఆనాటి నీతీ నిజాయితీలు .. . నేడు మంట గలిసి పోయాయి

నాటి భారతీయ సంస్కృతి.. . అంతరించి పోతోంది

ప్రాశ్చ్యాత్య      సంస్కృతి .. . విస్తరించి పోతోంది

వాలు జడ రోజులు.. . కను మరుగై పోతున్నాయి

భార్యా భర్తల బంధాలు.. బలహీనమవుతున్నాయి

నువ్వా? నేనా? అని ఆ బంధం తెగేదాకా లాగుతున్నారు

విడాకుల కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి

పుస్తకాలు  చదవడము తగ్గి పోతోంది

సాహిత్యాభిమానం క్షీణిస్తోంది .

చతుష్షష్టి కళల్లో . . బ్రతికున్నవి   ఎన్ని ?

గుండె మీద చెయ్యేసుకుంటే మనకే తెలుస్తుంది .

ప్రాశ్చ్యాత్య సంస్కృతి మరీ ...  పాతుకుని  పోతోంది

తలచుకుంటే .. గుండెల్లో గుబులౌతోంది .



ఈ  కవిత ' విశాల భారతి '  నవంబర్  2013 మాస పత్రిక లో ప్రచురించ బడినది 







































































































































































 

కార్టూన్-2


కార్టూన్-1


Friday, 26 July 2013

వినాయక తత్వం

         వినాయక తత్వం

ఎంతో మంది నమ్ముతారు .. .
సిద్ధి,  బుద్ధి అనే  ఇద్దరు గణపతి కి..   భార్యలని.


వారికి  క్షేమము ,లాభము అనే..  ఇద్దరు పుత్రులని.
భార్యా.. . పుత్రులంటే  ..అవి మానవ బంధాలు కాదు. 

గ్రహించాలి మనము ..  దాని అంతరార్ధము
భార్య అంటే .  ..శక్తి యని  మనం తెలిసికొనాలి. 

చెడు పనులకు విఘ్నం కల్గించడం ..సిద్ధి ప
ని
మంచి పనులకు అవిఘ్నం చేకూర్చడం ..బుద్ధి పని.

బుద్ధి, సిద్ధుల ద్వారా .. లాభాన్నీ, క్షేమాన్నీ .. .
కలుగజేసే తత్వమే వినాయక తత్వం.


                           
                                                             రచన: నందనవనం సురేంద్ర నాథ్

Wednesday, 24 July 2013

చాటి చెప్తున్నాయి..స్వామీ!

ఎన్నాళ్ళుగానో బందీగాయున్న             
ఆ చల్లని తల్లి గంగమ్మ                              
ఉగ్ర రూపం దాల్చిందంటే ..               
నమ్మలేను ..నే నమ్మలేను

నీవు మూడో కన్ను తెరిస్తే
ముందున్న ప్రపంచం  భస్మమవుతుందని
గంగమ్మను కాపలాగా  ఉంచావనుకొన్నా..  
వెంరనే  ఆ విధ్వంసాన్నిఆపడానికి . 

కానీ జరిగినదేమిటి?
నీవే ఆ గంగమ్మ సాయం గోరి .. .
వేలాది మంది  భక్తాగ్రేశ్వరులను
శి (నీ) వైక్యం జేసుకొన్నావా ?..  స్వామీ?

నా పిచ్చి గానీ.. . శివుని ఆజ్ఞ లేనిదే..
చీమైనా.. . కుట్టదని నాకు తెలియనిదా ?
గంగమ్మ ఉగ్ర రూపానికి నీవే గదా.స్వామీ!.
 కనుసైగ చేసి ..భీభత్సాన్ని సృష్టించింది. 

బీదవాడా ? ధనికుడా? తెలీనే తెలీదు.
ఏ రంగు బట్టలో అసలు తెలీదు
బురద గప్పిన శవాలన్నీ. . .ఒకేలా ఉన్నాయి
నీ దృష్టిలో అందరు ఒకటేయని చాటి చెప్తున్నాయి..స్వామీ!

నే బ్రతికుంటే..

ఓ శివా!
భగీరధ ప్రయత్నం లో
ఆకాశం నుండి దిగిన గంగను 
జటాఝూటం లో బంధీ గా ఉంచావు. 

ఎన్నాళ్ళని బంధీగా ఉంటుంది .. ఆగంగమ్మ? 
కేదార్ నాథ్ ఆలయపు రూపు రేఖల్ని 
తుడిచి పెట్టింది శివా.. నీ నెత్తిన ఉన్న గంగమ్మ
అందుకే అంటారు శివా !

ఎంతటి ప్రీతి పాత్రులైనా .. . నెత్తినెక్కించుకోకని 
ఆడవారిని ఓదార్చే చట్టాలెన్నో వచ్చాయ్ 
వంచన చేసే మగవారికి  శిక్షలెన్నో వచ్చాయ్ 
నీకు తెలియ కుండానే నీవు గంగమ్మ ను బంధించి ఉంచావ్ !

నెత్తి కెత్తుకున్న నేరానికి 
గంగమ్మ ఉగ్ర రూపాన్ని చవిజూచావ్!
పిల్లినైనా గదిలో బంధిస్తే .. . 
పులిలా మారుతుందని తెలీనిదా నీకు?. 

ఎంతటి భక్తాగ్రేశ్వరు లో .. గదా!
నిను దర్శింప వచ్చినవారు 
వారి నందరినీ .. .నీ ( శి ) వైక్యం జేసికొన్నావు 
పోయినోళ్ళ తీపి గురుతులుగా  కొందరిని వదిలావు .

ఓ ముక్కంటీ !
కేదార్ నాథ దామం పునరుద్దరణ ఎప్పటికౌనో? ..  ఏమో?
నిను కళ్ళారా.. . చూడాలని ఉంది.. .  పరమేశ్వరా !
ఎంతకాలమైనా ఎదురు చూస్తాను.. . నే  బ్రతికుంటే.. . 

ఈ  కవిత ' స్వర్ణ పుష్పం  '  సెప్టెంబర్   2013 మాస పత్రిక లో ప్రచురించ బడినది 







 

Tuesday, 23 July 2013

మధ్య తరగతి జనజీవితం.. .

అందరం మనుషులమే.. . ఎందుకీ వ్యత్యాసం?
ఈ భూమిమీద.. . పంచభూతాలూ అందరికీ సమానం.

బీదరికం.. రాచరికమని   రెండు వర్గాలుగా ఉందీ జగం
 అటూ ఇటూ ఊగుతున్న ఊయల ..మధ్య తరగతి జనజీవితం

ఇటు బీదరికం దగ్గర ఆగలేదు.. . అటు ధనికవర్గం వద్ద ఆగలేదు
జీవితమంతా  ఊగీ..ఊగీ ఆ రెండు వర్గాల మధ్యన ఆగుతుంది.

ప్రభుత్వ పధకాలు  అట్టడుగు వర్గాల వారికి.. .వరాలు
ధనిక వర్గాల వారికీ ఇస్తారు.. . ఎన్నెన్నో రాయితీలు.

మధ్య తరగతి వాడడుక్కొని తినలేడు ..  అప్పు చేసి తీర్చలేడు .
ఇటు రిక్షా తొక్కి బ్రతుకలేడు .. . అటు కారు ఎక్కి తిరగలేడు. 

చివరకు మధ్య తరగతి లోనే .. . ఆ ఊయల కదలిక ఆగిపోతుంది.
మధ్యతరగతి వాళ్ళ బ్రతుకులు.. మధ్యతరగతి  లోనే ముగుస్తాయి.

మధ్య తరగతి నుండి బైటపడేందుకు..మంచిగా చదువులు చదవాలి
నిరంతరం  కృషి చేయాలి ...   అభివృద్ధి పధం లో నడవాలి.

 


Sunday, 21 July 2013

అచ్చుల్లో .. . అమ్మని చూడు

                          అచ్చుల్లో .. . అమ్మని చూడు

అమ్మ.... . అమ్మ.. . అమ్మ
ఆప్యాయత లో ఉంటుంది .. . అమ్మ
ఇంటికి శోభ.... . అమ్మ
ఈ జన్మ నిచ్చింది.. . అమ్మ
ఉషోదయమే నాజీవితానికి  మా.. . అమ్మ
ఊయలలో ఊపి నిద్ర పుచ్చింది.. . అమ్మ
ఋషి  పుంగవుల గురించి బోధించింది.. . అమ్మ
ఎన్ని ఇక్కట్లు ఎదురైనా బిడ్డని పెంచుకునేది.. . అమ్మ
ఏమి కావాలో బిడ్డ అడాగకుండా తెల్సుకునేది.. . అమ్మ
ఐనదానికీ  కానిదానికీ మారాం చేస్తే..  సహించేది.. . అమ్మ
ఒంటరిగా వదల కుండా బిడ్డ ని కాపు కాచేది.. . అమ్మ
ఓపిగ్గా కథలు చెప్పి అన్నం తినిపించేది.. . అమ్మ. అమ్మా ..   నీ
ఔన్నత్యం  తెలుప నలవి కానిదమ్మా!
అంతంత మాత్రపు కుటుంబా లైనా అమ్మ పాత్ర...  అమ్మదే
అహర్నిశలు బిడ్డ భవిష్య త్ గురించి ఆలోచించేది.. . అమ్మ


నా కోరిక

              

           నా .. . కోరిక

నాలుగు రోడ్ల కూడలి అది 
నలుగురు బిచ్చగాళ్ళు   ప్రతి రోడ్ కీ
రెడ్ సిగ్నల్ వస్తే రెడీగా వుంటారు
 గ్రీన్ సిగ్నల్ వస్తే  సైడిస్తారు. 

లోన కడుపు మండుతోంది 
పైన వాన కురుస్తోంది 
చేతిలో వున్న బొచ్చె
పైసలకోసం ఎదురుచూస్తోంది. 

కన్నా బిడ్డల్ని వానలో సైతం.. నిలబెడతాం
క్లబ్బుల ముందైనా.. కాలేజీ ముందైనా 
మీరు పబ్బుల్లో..   తాగే ఓ పెగ్గు రేటు
మా  జోలెల్లో వేస్తే..  పిల్లలను మేము  చదివిస్తాం. 

పగలంతా పైస లడుక్కుంటాం  
రాత్రయితే  పట్టెడన్నం ..  అడుక్కుంటాం 
అడుక్కొచ్చిన ఎంగిలి మెతుకులు
మా కడుపు మాడ్చుకొని  పిల్లలకెడతాం. 

చేద్దామంటే పనిలేదు ..
తిందామంటే  తిండి లేదు 
ఉందామంటే గుడిసె లేదు ..
పిల్లల్ని చదివిద్దామంటే డబ్బులేదు . 

ఎన్నిక లొచ్చినపుడే..  మేము 
లెఖ్ఖల్లోని  మనుషులం
ఎన్నికలై పోయినాక ..మేము
వీధి కుక్కలకన్నా .. హీనం.

చెట్లే మా ఇళ్ళు .. ఎండయినా వానయినా.. 
వరదలన్నా వస్తే.. . మా జీవితాలు ముగుస్తాయి
మాకన్నీటికి ఆనకట్ట కడతాయి ..కానీ మా పిల్లల్ని
ఇంగ్లీషు  ఇస్కూల్లో చదివించాలని ..  నా కోరిక.  
 

 
 






Friday, 19 July 2013

అప శృతి

మంచో చెడో ఏది జరిగినా  నీ కాలేజీలో .. .
ఇంటి కొచ్చి పంచుకో.  .. మీ అమ్మా నాన్న లతో

చాలా కాలేజీల్లో .. . దాదాపు పది శాతం పిల్లలు
అల్లరి చిల్లరి గా.. .   కాలం గడిపేస్తూ ఉంటారు.

ఒక రకం విద్యార్ధులు  అమ్మాయిల నల్ల రి చేస్తారు
ప్రేమంటూ దోమంటూ మిము ముగ్గు లోకి దింపుతారు

అమ్మాయి ల  దృష్టి లో పడేందుకు ఎన్నో పాట్లు పడతారు
ఖరీదైన కార్లు ..కాలేజీ టైము లో షికార్లు

ద్విచక్ర వాహనాల  పై   ఫీట్లు .. . ఎస్ట్రా పోకడలు
 విలక్షణమైన వస్త్రాలు  .. .మరెన్నో   అవలక్షణాలు

పది మందిని పరిచయం చేసికొంటాడు
మీరంతా.. .   నా చెల్లెళ్ళని  అంటాడు .

చక్కని ఓ అమ్మాయిని చూపి.. . ఆ అమ్మాయే నా ప్రేయసి అంటాడు.
మీకు  ఐస్క్రీమ్ లు తినిపిస్తాడు .. . సినిమాలు చూపిస్తాడు .

తన ప్రేయసి మనసు మార్చ మంటాడు .. .
మీరు ఆ పిల్ల మనసు మార్చాలి.. . వాడి లైన్ క్లియర్ చేయాలి .

అదేదో  ఘనకార్య మన్నట్లు .. . ఆ పిల్ల జీవితం తో మీరు ఆడు కుంటారు
ప్రేమో.. . కామమో .. తెలియని మీరు..  ప్రక్క వారి  జీవితం తో అడుకోవద్దు.

ప్రేమ పేరుతో జరిగే పొరపాట్లు... . చాలా జీవితాలకి శాపాలని తెలియక 
మధ్యవర్తిత్వం  చేసి ..  మీరు తప్పు చేస్తారు  

జరగాల్సిన నష్టం జరిగి పోతుంది ..ఆ లేత మనసు గాయ పడుతుంది.
 ప్రేమలో .. అప శృతి  ప్రాణాన్ని  తీస్తుంది .

ఈ  కవిత జీవన వికాసం మాస పత్రిక డిసెంబర్ 2013 సంచిక లో ప్రచురితమైనది 



Saturday, 13 July 2013

మళ్ళి రాదు సుమా! మానవ జన్మనీకు .

వృద్ధాప్యం లో నీకు నేను  ప్రతిక్షణం గుర్తొస్తా.. . 
నీవు పడే అగచాట్లలో..ప్రతిచోటా కన్పిస్తా .. .
నీవు చేసింది ప్రేమించడం కాదు ఆనాడు 
నాకు తెల్సింది .. . అది కామించడమని నేడు. 

నీ కామాంధకారానికి .. .ప్రేమనే తేనె పూత పూశావ్ 
అమాయకపు ఆడవారిపై   ప్రే (కా)మవల విసిరావ్ 
వలలో పడ్డ వనితలతో కోరికలు దీర్చుకొన్నావ్ 
ఏది యేమైనా .. . నీదే పై చేయి కావచ్చునేటికి . 

ఎందరో  జీవితాలతో.. .  ఆడుకొని యుండచ్చు ఈనాటికి 
ప్రేమించామని మోస బోయిన యువతుల జీవితాలు 
కొన్ని.. .  అంతమై పోయి యుండవచ్చు నిరాశతో.. .
మరి కొన్ని జీవితాలు.. . మసిబారి యుండ వచ్చుగాక .

నీ భార్యా పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు
నీకళ్ళముందే నువ్వు జేసిన పాపానికి 
ప్రతి ఫలం అనుభవిస్తుంటే .. .చూస్తూ.. .
ఏమీచేయలేని అధమస్తుని లాగా బ్రతుకుతావ్ !

నీవు చేసిన పాపం నీకు న్యాయం గావచ్చు 
అది నీ పిల్లల పాలిట మాత్రం .. . శాపం
పాపాల ఫలితం అనుభవించు.. .  ఈ  జన్మ లోనే.. . 
మళ్ళి రాదు సుమా! మానవ జన్మనీకు . 






ప్రేమను హతమార్చకు ప్రియా!

నీ చిలిపి చేష్టల గురుతులు
చిరు నగవై జాలు వారె  ఆనాడు
నీ కోరిక దీరిన నాటి నుండి
నీ దరిశనమే కరువాయె నాకు

నీ జీవితాన నేనే  భాగస్వామి నని
తీయని తేనెల మాటల మూటలతో .. .
నా సర్వస్వము నీవేనని .. . నమ్మించితివి ఆనాడు. 
ఆ నమ్మకమంతా నాటకమని తేలిపోయె  నేడు. 

నా కనురెప్ప లో నీవు చేసిన గాయం ..
కను మూయనీయదు.. . నీ తలపుల  సాక్షిగా. ..
నీకు తెలుసు  నిజాయితీగల నడవడిక నాదని
నా జీవితాన నీవే నా భాగస్వామి వని.!

ప్రేమను కోరికతో జత జేసావ్ ...
ఎంత వారించినా.. .  విన్నావు కాదు 
నాడు.. .   నీ కోరిక దీర్చిన   ప్రేయసిని నేను 
నేడు.. . నీ దృష్టి లో  నే నొక వ్యభిచారిని .  

నిజాయితీ నీలో.. .  లోపించినా ...
నీతలపులే మెదులుతున్నాయ్ ..నా ప్రేమ సాక్షిగా.. .
ప్రేమంటే.. .  కోరిక కావచ్చు నీమదిలో .. .
కోరిక దీరి నంతనే ప్రేమను హతమార్చకు ప్రియా!
 

Friday, 5 July 2013

ఆనందమంత మనదేలే!



మురుగు నీరు పారుతుంది..ఇంటిముందరే..
మరుగు దొడ్లు లేనిబాధ.. .అందరికీ తెలిసిందే..
మనకెంతో ఉందండీ.. .మంచి నీటి కిబ్బందీ..
ప్రభుత్వపు దృష్టి కి మన వాడ వచ్చింది.

అస్ బెస్టాస్ రేకుల..ఇళ్ళు    ఉన్నాయి  కొందరికి
ఇనుప రేకుల ఇళ్ళు   ఉన్నాయీ .. .కొందరికి
తడికల గుడిసెలున్నవాళ్ళు ..ఎందరో ఉన్నారు
మన అందరికీ  నేడు... మంచి రోజు వచ్చె చూడు.

మన మురికి వాడలను...సమూలం గా మార్చి వేస్తారూ..
కల్పిస్తారు మనకెన్నో..మౌలిక  సదుపాయాలూ...
ఒక పద్దతంటూ లేని.. . మన ఇళ్ళను చూడు
ముచ్చటైన ఫ్లాట్లుగా..కనిపించును రేపు.

మురికి వాడలు లేని.. . నగరం కోసం...
సమైక్యంగ మనమంతా .. .సహకరించుదాం!
అధికారులకు ..సహకరించుదాం!
సహకరించుదాం! సహకరించుదాం!

రాజీవ్ ఆవాస  యోజన పథకమంటే ఇదేరా!
రెండు మూడు అంతస్థుల ఫ్లాట్లు వచ్చు సోదరా!!
పూర్తిస్థాయీ హక్కులు ఇక్కడున్నవారికే.. .
ఫ్లాట్ల లోకి చేరినాక.. .  ఆనందమంత మనదేలే!

                                                                                        రచన : నందనవనం సురేంద్రనాథ్