Friday, 28 June 2013

అన్నా హజార్... హజార్ వందనాలన్నా...

                                                                      రచన: నందనవనం సురేంద్ర నాథ్
దుంధుభి మ్రోగించి అవినీతిపై..                                                                      
బా వుటా ఎగరేసి ప్రజల గుండెల్లో
దా దాగా నిలిచావు ఓ హజారే అన్నా..
జిం దగీని ఫణంగా పెట్టి,
రే యింబవళ్ళు దీక్ష జేసి,
జా గృతి పరచి ప్రజలను.అవి నీతిపై  కేంద్రాన్ని
డలెత్తించిన ఓ హజారే  అ
న్నా..నీకు హజారు వందనాలన్నా..
వినీతి పై పోరు ఆపద్దొద్దు అన్నా!!



జనలోక్ పాల్ బిల్లు రాగానే సరిపోదు
సక్రమంగా దాన్ని అమలు చేయాలి
ప్రతి ఒక్కరి ఆస్తిపై పరిమితి విధించాలి
చిత్త శుద్ధితో ప్రజలు దానికి సహకరించాలి

ఎండగట్టాలి ముందు అవినీతికి దారులు
చేయాలి అవినీతి పరులపై ఎసిబి దాడులు
సింగపూరు లోనో, స్విస్ బ్యాంకుల్లోనో
శోధించి,శోధించి..సాధించాలి నల్ల డబ్బు మూటలు.

కోటాను కోట్ల... నల్ల డబ్బు నోట్లు !!
రాబట్టిన సొమ్మంతా జాతీయం చేయాలి
అవి నీతి రహిత భారత్ అందరికీ కావాలి
అందుకే ..అందరం..............................

చేయి చేయి కలిపి సాగాలి మున్ముందుకు
అవినీతిపై పోరు ముమ్మరం చేసేందుకు
   


PUBLISHED  IN 'PAALA PITTA' TELUGU MONTHLY IN JANUARY 2013                   

వినరా.. వినరా ..నా మాటా!

వినరా... వినరా .. నా... మాటా!  
వింటే... మంచిది నా... పాటా
పారిస్తే... మంచిది ఈ ...పూటా..      //వినరా//


కాలేజీ కెగ గొట్టకూ..క్లాసుకు డుమ్మా కొట్టకూ....
క్లాసులొ శ్రద్ధగ వినాలీ...అనుమానాలుంటే అడగాలీ!


అసలు రేపటి పారము ఈ రోజే ఇంటివద్ద నువు చదవాలీ!
నీకర్ధం కాని విపయాన్నీ..క్లాసు లో అడిగీ నేర్వాలీ!     //వినరా//


బాల బాలికల పరిచయము హద్దులు దాటక ఉండాలీ!
చదువుకునేందుకు నిను పంపారూ..చెడు తిరుగులు నువ్వు తిరగొద్దు.


పాకెట్ మనీ ఉండాలీ... అది అత్యవసరానికే వాడాలీ!
అమ్మా..నాన్నల ఆశలనూ...అడియాశలు నువ్వు చేయద్దూ!!    //వినరా//

Thursday, 27 June 2013

శరణని నిను వేడితీ ...సాయీ..

శరణని నిను వేడితీ ...సాయీ..
శరణని నిను వేడితీ ...ఈ.....   //శరణని//

మమతల  నెంతో .. .పంచిన నీవు 
మహిమలనెన్నో.. .చూపిన  నీవూ
మానవలోకపు .. .అవదూతవూ.. ..   //శరణని//

మతములన్నియు.. ఒకటే నంటివీ
సతతము వెన్నంటి ...నీడగ యుంటివీ 
 సతతము వెన్నంటి ..నీడగ యుంటివీ ..  //శరణని//


మానవులైనా... దానవులైనా...
శునకములైనా... అశ్వములైనా.. .
ఉన్నఆకలి ..  ఒకటే నంటివీ  ...           //శరణని//

మతము లన్నియు ఒకటే నని నీవు
బిక్షాటనలో..  దానము లంది
మా పాపముల  నీవే.. . తొలగించితివీ.. .//శరణని//










Sunday, 16 June 2013

ఇంటర్ చదువు

 చదువు  చదువు  చదువు అంటూ
ఎల్ కే జీ  లో చేర్చి ఎ బి సి డి లు నేర్పారు
యూ కే జీ కి రాగానే హోమ్ వర్క్ లిచ్చారు
ఫస్టు క్లాసు లోనే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు                     
సెకండ్ క్లాసు నుండి కొంచెం ఫ్రీడం నిచ్చారు
సెవెన్త్ లోన నను  ఇబ్బంది పెట్టారు
టెన్త్ క్లాసు లో నను ఒత్తిడికి గురిచేసి
ఎక్కువ మార్కుల   టార్గెట్  ఇచ్చారు 
నాకు వచ్చిన మార్కుల తోటి - తృప్తి లేదు మీకు
కనీసం ఇంటర్ లో నన్నా -నా వ్యూస్ ని అడగరు 
 నాకు నచ్చిన సబ్జెక్టు ను - నన్ను చదువు కో నియ్యరు 
నాల్గు గోడల మధ్య - రోజుకు  పన్నెండు గంటల చొప్పున 
కార్పొరేట్ చదువు చదివి 
నలిగిపోయి, అలిసి పోయి - ఇంటికి వస్తే .. 
ప్రిన్సి చెప్పాడనీ, డాడీ చెప్పాడనీ .. ఇంటివద్ద 
మూడు గంటలన్నా..  చదవాలనీ చెప్పి 
అన్నంతింటే ... నిద్ర వస్తుందేమోనని 
మూడు గంటలుచదివాకే..  నాలుగు ముద్దలన్నం పెట్టి 
తెల్లవారు ఝామునే  నిద్ర లేపి ..  ఇంటర్ చదువును చదివించారు 
                                                                          రచన : నందనవనం సురేంద్ర నాథ్ 

నది

నువ్వు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంటే                      §¶ú¶þ¶: þ¶Ï†¶þ¶©¶þ¶Ï  ¬µ¿§Èφ¶ë నాథ్ 
నిన్ను చూసి పరవశించడం నేర్చుకున్నా ..
నువ్వు కొండలూ గుట్టలూ దాటి పోతుంటే 
నిన్నుచూసి అవరోధాలను అధిగమించడం నేర్చుకున్నా .. 

 నువ్వు ఇరకు దారైనా ..విశాలమైన దారైనా
 హాయిగా ప్రయాణిస్తుంటే . . 
నిన్ను చూసి సమాజం లో ఒదిగిపోవడం నేర్చుకున్నా ...  

నువ్వు తీయటి  నీటినిచ్చి 
లక్షల మంది దాహాన్ని తీ ర్చడం    చూసి
ఎంతో కొంత మందికి   కాదు .. కాదు.. 
సాధ్యమైనంత మందికి సాయం చేయడం  నేర్చుకున్నా... 
  
నీలో పవిత్ర  స్నానాలు చేసిన వారికి 
సమస్త పాపాలను తొలగిస్తావంటే .. 
నిన్ను చూసి క్షమా గుణాన్ని నేర్చుకున్నా ... 
నిన్ను చూసి ఎన్నో ..నేర్చుకున్నా ... 

 ఇంకా ఎన్నెన్నో.. నేర్చు కోవాలని ఉన్నా .. 
వర్షా కాలం లో హొయలు చూపిన నువ్వు 
మళ్ళా వర్షా కాలం దాకా కనపడనే కనపడవు
అడుగు తున్నా  ఋతుపవనాలని  నువ్వెక్కడని?

ఈ  కవిత ' మహిళా విజయం'  సెప్టెంబర్ 2013 మాస పత్రిక లో ప్రచురించ బడినది 
 

Saturday, 8 June 2013

''ప్రేమ ఖైదీ'

కత్తిరించిన  ముంగురులు
మోముపై  జార్చి.. 
పైపైకి సవరించె
ఆ సుందరి నన్ను జూచి .

అందమున ఆమె
రంభను తలపించె.. 
నామనసు దొంగిలించె
ఓర చూపులు చూచి .

వాలుజడ రోజులు
మారిపోయినవి .. నేడు
దశాబ్దములు గడిచె 
పూల జడను చూసి.

యవ్వనమున ఆ కన్నె
అందము లొలికించి ... 
చూడనట్లు నటించె
పరపురుషుడ  నన్నుజూసి.

 ప్రేమవిషయాన  నేటియువత
ఆచి తూచి అడుగేయవలె.. 
'ప్రేమ ఖైదీ 'నైతిననిపించె
అనితర ఆమె అనంత సొగసుజూసి .                           §¶ú¶þ¶: þ¶Ï†¶þ¶©¶þ¶Ï  ¬µ¿§Èφ¶ë þ·ý

Tuesday, 4 June 2013

సంక్రాంతి సంబరాలు

ఈ అనుసంధానము లో చిత్రాలు ఉంటే, అవి ప్రదర్శింపబడవు.  అసలు అనుసంధానమునుడౌన్ లోడ్ చెయ్యండి
    
రంగ రంగ వైభవంగా జరుపు కుంటారు
ఇంటింటా .. . సంక్రాంతి సంబరాలు
తరచి చూడ ఇంటి లోన, ఇంటి ముందు
ఇంటి చుట్టూ .. .తీర్చి దిద్దిన  రంగవల్లులు 

ఊరూరా
.. .  కోకొల్లలు 
రంగవల్లుల పై ఉంచిన గొబ్బెమ్మలు
గొబ్బెమ్మల చుట్టూ చల్లిన
చెరకు ముక్కలూ .. పూలరెక్కలూ .. 

ధనుర్మాసం మొదలైంది మొదలు .. .
ఊరూరా వెంకటేశ్వర స్వామి
తిరుప్పావై .. ప్రవచనాలు
వీధి వీధిన తిరిగే గంగిరెద్దులు.

గంగిరెద్దు
యజమాని  అయ్యగారికి దణ్ణం పెట్టు
అమ్మగారికి దణ్ణం పెట్టు అంటుంటే ..
ముందున్న కుడికాలెత్తి ..నమస్కారం పెట్టే
సంస్కారం ఉన్న ఎద్దు మన గంగిరెద్దు
 
ఉదయాన్నే.. . ఇంటి ముందు
తప్పకవేసే.. . భోగి మంటలు ఒక వైపు
భోగిమంటల వేడికి తాళలేక ..
పారి పోయే మంచు తెమ్మెరలు. 

ఒకరొకరుగా వచ్చి పాడిపోయే.. .
హరిదాసు  కీర్తనలు ఒకవైపు
ఎగరని పతంగులతో 
పిల్లలు పడే తంటా మరో వైపు.

వంటింట్లో ..అమ్మ చేసే .. .
నువ్వు అరిశల సువాసన ఒకవైపు
గిరీటీలు కొట్టే పతంగులను జూసి ..
కేరింతలు కొట్టే .. . పిల్లలు మరో వైపు. 

పండక్కి .. .ఇంటికొచ్చిన కూతుళ్ళూ,అల్లుళ్ళూ..
ఆట పట్టించిన మరదలిపై..అలిగిన బావ గారూ..
కొత్త కోకలతో  కనిపించే.. పేరంటాళ్ళూ.. . 
పట్టు పావడాలలో .. .ఆడపడుచులు .

చుట్టు  పక్కల ఇళ్ళ  నుండి పేరంటానికి
వచ్చిన  తమ ఈడు తోటి పిల్లలు .
చిట్టి చిట్టి బుడతల నెత్తిన 
ఆశీర్వదించి పోసే భోగి పండ్లు. 

ముగ్గు తెలుపు కోసం
కలిపిన బియ్యప్పిండిని 
తినడానికి వచ్చి సంక్రాంతి ముగ్గుపై
వాలిన పిచ్చుకల దండు. 

పండిన పంట గింజల ను 
ఇంటికి చేర్చే యెడ్ల బండ్ల సోయగాలు.
ఎంత వద్దన్నా కోడి పందాలను 
చూడడానికెళ్ళే ఇంటి పెద్దలు. 

పైకి చదివితే శ్రవణానందం
కళ్ళకు కట్టినట్లు కన్పిస్తే  నయనానందం. 
ఏది ఏమైనా.. .ఈ మూడు రోజుల  పండుగ 
తర తరాల సంక్రాంతి పండుగ.
                                                          §¶ú¶þ¶:
          þ¶Ï†¶þ¶©¶þ¶Ï  ¬µ¿§Èφ¶ë నాథ్        


                                

అమ్మా ఓ ..అమ్మా !




ఉమ్మ నీటి నుంచి నెమ్మదిగా బైటికొచ్చి 
ఈ రంగుల ప్రపంచం లో ముందుగా చూచింది అమ్మనే !
మొదటి ఏడుపుకి ముర్రుబాలు త్రాపింది 
చిచ్చ  పోసి ఏడిస్తే  ...   బట్టలను మార్చింది 
మరోమారు ఏడిస్తే   ...  బట్టతో తుడిచింది 
పగలు పుట్టిన నాతో ... రాత్రంతా మేల్కొంది 
ప్రక్కనే పడుకొని  ...  వెచ్చదనాన్ని యిచ్చింది 
పథ్యెముండి అమ్మ  ... తనపాలను త్రాపింది 
ఆదమరిచి నిద్రిస్తే  ... పడకుండా చూసింది 
'ఆమ్ ' తిననని మారాం  చేస్తే ... చందమామను చూపింది 
హాయిగా నిదురించమని... జోల పాట పాడింది 
కలలోన భయపడితే ... వెన్నుతట్టి నిమిరింది 
దోకాడు  వేళల్లో ...చాప నేల బరచింది 
ఏమని వ్రాయను? .. ఎంతని వ్రాయను ?
ఎంతో చేసి నను...  ఇంత వాడిని చేసింది
ఎన్నో చేసిన అమ్మకు ఎంత చేసినా ..ఋణం  తీరునా ?
చంద్రునికో నూలు పోగులా ....అమ్మకే ఇస్తున్నా ..  
ఈ  కవితని ' అంకితం'

                                                                                 రచన : నందనవనం సురేంద్ర నాథ్

Sunday, 2 June 2013

ఆవేదన. .

     ఆవేదన


వానలు లేవు .. పంటలు పండగ 
మేత లేదు...పసువుల మేపగ 
తిండి గింజలు లేవు ..వంట చేయగ 
త్రాగు నీరు లేదు ..కడుపు నింపగ 

మేపలేని పసువులను
ఓ కసాయి వాని కమ్మి                    
గా పైసలిస్తిమి దు బాయి కి పంపే
ఓ బ్రోకరిని నమ్మి. 

ఏదో పేపర్ ల తో మమ్ము 
ఇమానం ఎక్కించిండు
ఉద్యోగాలున్నా యని నమ్మబలికి
దుబాయి కి పంపిండు . 

ఇమానం దిగిన నాకు ఎవ్వ డూ
కలువ లేదు  గా దుబాయ్  లో 
గా బ్రోకర్ చెప్పిన మాటలన్ని
కలిసి పోయినా య్  గాలిలో .. 

బావురు మం టూ ఏడుస్తూ.. 
ఆకలి పొట్టను మాడుస్తూ. .
పని కోసం వెతుకుతూ
ఎవరికి  వాళ్ళం గా విడిపోయాం . 

గడుస్తున్నాయ్.. . రోజులు 
గాడ నీళ్ళూ .. . కూడా కొనుక్కో ని త్రాగాల. 
నీళ్ళ కే పైసలన్నీ .. నీళ్ళ లా ఖర్చై  పోయినా య్
తినడానికి పైసా లేదు..  మరి వున్నదేమో దుబాయ్.

బ్రతకడాని కనొచ్చి బలైపోయాను 
ఓ షే కు ఇంట వంట పనికి కుదిరాను
ఆళ్ళు గిడ్స వెట్టి న అన్నం తిని .. కడుపు నింపు కున్నాను
గాడ బానిసగా బ్రతుక లేను ..ఆకలి కడుపున పండ లేను 


పేపర్లు సరి లేవంటూ ..పోలీసు ల  జులుం ఒక వైపు 
పని లేదు పొమ్మంటూ .. షేకు కుటుంబం ఒకవైపు 
చివరాఖరిగా  మమ్మల్నందరిని అరెస్టు చేసిన్రు 
జైలు లో పెట్టి గంత అన్నం బెడుతున్రు.


ఎన్నో నెలలు గడిచినాయి.. దుబాయి జైలు లోనే
దయతో ఆళ్ళు క్ష మా భిక్ష ఎట్టి ..తిరిగి ఎల్లమన్రు 
ఎదురు చూస్తున్నాము ..కన్నీరెండిన కోటి కళ్ళతో .. 
దయగల ప్రభువులు మము ఇడిపించి తెండి







                                                         రచన:
                నందనవనంసురేంద్రనాథ్ 
                                సెల్ 90307 99639

Saturday, 1 June 2013

దారుణం

దేశప్రజలు యావత్తు ని 
ఒక్క త్రాటిపై తెచ్చిన 
డిల్లీ దారుణ అత్యాచార సంఘటన   
సభ్యసమాజాన్ని తట్టి లేపింది. 

స్నేహితునితో కలిసి సినిమాకని వెళ్ళి
తిరిగి వస్తున్నా ఫిజియో తెరఫీ విద్యార్ధిని 
డిల్లీ లోని మునిర్కా ప్రాంతం లో .. ఓ ప్రైవేటు బస్సు నెక్కారు . 
నరరూప రాక్షసులు అందులోనే ఉన్నారు. 

ఆమె మీద పడి..  దారుణంగా అత్యాచారం చేశారు 
అడ్డు వచ్చిన స్నేహితుడిని .. మక్కెలు విరగ గొట్టారు  
వివస్త్రలుగా చేసి వారిని ..నడిచే బస్సునుండి క్రిందకు తోసేశారు . 
విషయం  తెలిసి ప్రజలంతా .. ప్రభుత్వాన్ని నిలదీశారు. 

భారత్ లో సఫ్దర్ జంగ్ ఆసుపత్రి లోనూ 
సింగపూరు లోని ఆసుపత్రి లోనూ ..చికిత్స  పొందినా 
అత్యంత విషమంగా మారిన ... ఆరొగ్యంతో యున్న 
బాదితురాలి  బ్రతుకు...  గాలిలో కలిసి పోయింది 

అమ్మా నాకు బ్రతకాలని ఉంది 
నన్ను చిత్ర హింసలకు గురి చేసిన వారికి
 కరిన శిక్షలు పడేటట్టు చూడాలని 
చివరి మాటలుగా అమానత్ అంది. 

వారికి మరణ దండణయే సరి యైనది అని 
సుష్మా స్వరాజ్ ... జీ
కారిన చట్టాలకు సహకరిస్తామని
 మయావతీ.. జీ
ఆమె బలిదానం తేవాలి క్రొత్త సమాజమని 
మీరాకుమార్..  జీ 
ఈసంఘటన సిగ్గుగా ఉందని.. 
షీలా దీక్షిత్ ..  జీ 
సురక్షిత భారత్ కోసం కలిసిరండని
మన్ మోహన్ సింగ్.. జీ 
ప్రియ పుత్రికపోరు వృధా పోదని
సోనియా...జీ  అన్నారండీ.
 
స్త్రీలను గౌరవించడం వల్లనే 
ఆయా .. కుటుంబాలు వర్ధిల్లు. 
అనాదిగా సత్ సాంప్రదాయాలకు 
మన  భారతదేశం పుట్టిల్లు.                                 
                                                                     రచన :   అఖిల / సి బి ఐ టి / హైదారాబాద్