సెలయేళ్ళల్లో,చెరువుల్లో,గుంటల్లో
స్వేచ్చగా తిరిగే జల పుష్పాలం మేము
మేము అందంగా పుట్టడం
అందంగా కనిపించడం మా నేరమా ?
రంగు రంగుల చేపలమనీ
అందంగా ఉన్నామనీ.. .
మమ్మల్ని గాజు పలకల నీటి గది లో
బంధించడం మీ తప్పు గాదా?
మీ పిల్లలని చెప్పకుండా తీసికెళ్ళి
బంధిస్తే . .అవి 'కిడ్నాప్' లు
స్వేచ్ఛగా తిరిగే మా మత్స్యాలను
గాజు గది లో బంధిస్తే అది 'చట్ట బద్ధమా'?
మాస్వేచ్ఛ ని హరించడం తప్పు గాదా?
స్వేచ్ఛని హరిస్తే అడిగేందుకు మీకు కోర్టులున్నా. .
స్వేచ్ఛగా తిరిగే మీ పిల్లలకు ఒక న్యాయమూ
స్వేచ్ఛగా తిరిగే మా మత్స్యాలకో న్యాయమా?
ప్రొద్దున కాస్త ఆహారాన్ని మా ముఖాన పడేసి
రోజంతా 'ఆక్వేరియం' లో తిరగ మంటారు
రంగు రంగుల మా జలపుష్పాల ను
అందరూ చూసి ఆనంద పడతారు .
. . . . . నందనవనం సురేంద్ర నాథ్
.